బోరుబావిలో మూడేళ్ల బాలుడు..

దిశ, మెదక్: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. ఈ ఘటన పాపన్నపేట మండలం పోడ్చనపల్లిలో బుధవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మంగళి భిక్షపతి కూతురు మూడో కుమారుడు సాయి వర్ధన్(3) ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డారు. పిల్లాడి ఏడుపులకు బయటకు వచ్చిన తల్లిదండ్రులు.. బోరులో ఏడుపు శబ్ధాలు విని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ ఆంజనేయులు, తహసీల్దార్ బలరాంలు […]

Update: 2020-05-27 09:57 GMT

దిశ, మెదక్: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. ఈ ఘటన పాపన్నపేట మండలం పోడ్చనపల్లిలో బుధవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మంగళి భిక్షపతి కూతురు మూడో కుమారుడు సాయి వర్ధన్(3) ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డారు. పిల్లాడి ఏడుపులకు బయటకు వచ్చిన తల్లిదండ్రులు.. బోరులో ఏడుపు శబ్ధాలు విని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ ఆంజనేయులు, తహసీల్దార్ బలరాంలు ఘటనా స్థలానికి చేరుకుని బోరుబావిలోకి ఆక్సిజన్‌ను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఉన్నతాధికారులను సమాచారం అందించారు. ఆర్డీఓ సాయిరాం సమక్షంలో జేసీబీ సహయంతో బోరు బావికి సమాంతరంగా తవ్వకం చేపట్టారు. 108 వాహనాన్ని రప్పించి గుంత నుంచి బాలున్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. కాగా బోరుబావివ వద్ద తల్లీదండ్రుల తల్లడిల్లుతున్న తీరు అందరినీ కంటనీరు తెప్పిస్తోంది. 120 అడుగులు తవ్వినప్పటికీ నీరు రాకపోవడంతో బోరు బావిని యజమాని వృథాగా వదిలేశాడు. బోరు వేసిన అరగంటకే బాలుడు అందులో పడటం గమనార్హం.

Tags:    

Similar News