సింగరేణిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

దిశ, మణుగూరు : మణుగూరు సింగరేణి ఏరియా OC-2 బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనంపైకి డంపర్ ఎక్కడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతుల్లో పాషా ఎలక్ట్రిషన్, సాగర్ జనరల్ మజ్దూర్, వెంకన్న బులెరో డ్రైవర్ ఉన్నారు. అయితే, వీరిలో ఇద్దరు సింగరేణి కార్మికులు కాగా, ఒకరు ప్రైవేటు కార్మికుడు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాల ప్రకారం.. సింగరేణి ఓసి-2 లో పనిచేస్తున్న పాషా ఎలాక్ట్రిషన్, […]

Update: 2021-08-18 05:19 GMT

దిశ, మణుగూరు : మణుగూరు సింగరేణి ఏరియా OC-2 బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనంపైకి డంపర్ ఎక్కడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతుల్లో పాషా ఎలక్ట్రిషన్, సాగర్ జనరల్ మజ్దూర్, వెంకన్న బులెరో డ్రైవర్ ఉన్నారు. అయితే, వీరిలో ఇద్దరు సింగరేణి కార్మికులు కాగా, ఒకరు ప్రైవేటు కార్మికుడు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వివరాల ప్రకారం.. సింగరేణి ఓసి-2 లో పనిచేస్తున్న పాషా ఎలాక్ట్రిషన్, సాగర్ జనరల్ మజ్దూర్, వెంకన్న బులెరో డ్రైవర్ బుధవారం మధ్యాహ్నం మైన్‌లోకి వెళ్తుండగా హండ్రెడ్ టన్ డంపర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక సింగరేణి హాస్పిటల్‌కు తరలించారు.

ఏరియా హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లిపోయింది. విషయం తెలుసుకున్న కార్మికులు, కార్మిక సంఘాలు మృతదేహాలను సందర్శించారు. హాస్పిటల్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక సీఐ భాను ప్రకాష్, ఎస్సై నరేష్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించి విచారణ చేపట్టారు.

ఇది ఇలా ఉండగా కార్మిక సంఘాల నాయకులు ముమ్మాటికీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. డంపర్ ఆపరేటర్ శవల్ బ్రేక్ డౌన్ కావడంతో మరో శవల్ దగ్గరికి వెళ్ళాలని ఆపరేటర్‌కి ఆదేశించడంతో మైన్‌లోకి వెళ్లే ఆపరేటర్ అనుకోకుండా దారి మారే క్రమంలో ప్రమాదం జరిగిందని అధికారుల తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఉన్నత అధికారులతో విచారణ జరిపి మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాలు అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News