నర్సు కిడ్నాప్.. జుట్టు పట్టి ఈడ్చి కొట్టారు !
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నడిబొడ్డున నర్సును కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టిన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ నర్సుగా పనిచేస్తుండగా, ఆమె భర్త ల్యాబ్ టెక్నిషియన్‌గా చేస్తున్నారు. మూడేళ్ల క్రితం మణికొండ ప్రాంతానికి చెందిన ఆవుల రాజేశ్ బాధిత నర్సు దగ్గర మూడేళ్ల క్రితం రూ.55లక్షల అప్పు చేశాడు. అయితే పదిరోజుల్లో డబ్బు చెల్లిస్తానన్న అతడు ఈలోపు నమ్మకం లేకుంటే […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నడిబొడ్డున నర్సును కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టిన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ నర్సుగా పనిచేస్తుండగా, ఆమె భర్త ల్యాబ్ టెక్నిషియన్‌గా చేస్తున్నారు. మూడేళ్ల క్రితం మణికొండ ప్రాంతానికి చెందిన ఆవుల రాజేశ్ బాధిత నర్సు దగ్గర మూడేళ్ల క్రితం రూ.55లక్షల అప్పు చేశాడు. అయితే పదిరోజుల్లో డబ్బు చెల్లిస్తానన్న అతడు ఈలోపు నమ్మకం లేకుంటే వనపర్తిలో ఏడు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడని.. కానీ రెండు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి, పత్రాల్లో మాత్రం నెలరోజులకు డబ్బు తిరిగి చెల్లిస్తానని రాసినట్లు బాధితురాలు తెలిపింది.
అప్పటి నుంచి తమ అప్పు తీర్చాలని నిలదీస్తున్న తనను ఇటీవల సోమశేఖర్, నక్కల రాజేందర్ యాదవ్, పవన్‌రెడ్డి కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత శంషాబాద్‌లోని లాడ్జీలో బంధించారని బాధితురాలు వాపోయింది. అప్పటికే లాడ్జీలో ఉన్న ఏడుగురు చిత్ర హింసలకు గురి చేశారని, తాకరాని చోట్ల తాకి పైశాచిక ఆనందం పొందరాని, కత్తులతో బెదిరిస్తూ ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని కన్నీరు మున్నీరయ్యింది. వనపర్తిలోని ఆవుల రాజేశ్ ఇంటికి వెళ్లి ప్రశ్నించగా అతను జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టారని ఆవేదన వేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ 406, 365, 354, 342, 323, 504, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.