శ్రీరాంపూర్ సింగరేణి ‘గని’ ప్రమాదంపై సీరియస్ యాక్షన్.. బాధిత కుటుంబాలకు..!

దిశ, వెబ్‌డెస్క్ : మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంపై ఉన్నతాధికారులు స్పందించారు.ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు అధికారులపై వేటు వేశారు. డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్ వైజర్లను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాకుండా గని మేనేజర్‌కు ఛార్జిషీట్ జారీ చేశారు. వారంలోగా మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కాగా, మొన్న జరిగిన శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన […]

Update: 2021-11-13 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంపై ఉన్నతాధికారులు స్పందించారు.ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు అధికారులపై వేటు వేశారు. డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్ వైజర్లను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాకుండా గని మేనేజర్‌కు ఛార్జిషీట్ జారీ చేశారు. వారంలోగా మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కాగా, మొన్న జరిగిన శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News