తెలంగాణకు మరో మూడు స్కోచ్ అవార్డులు

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి స్కోచ్ అవార్డుల పరంపర కొనసాగుతోంది. తాజాగా రెండు బంగారు, ఒక వెండి పతకాలను 66వ స్కోచ్ సమ్మిట్‌లో అందుకోనుంది. పాలనలో ఆధునిక సాంకేతిక నైపుణ్యం వినియోగానికి గుర్తింపు లభించింది. బ్లాక్ చెయిన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాజెక్టుకు ప్రెస్టిజియస్ గోల్డ్ అవార్డుకు ఎంపిక చేశారు. దీని ద్వారా ట్యాంపరింగ్‌కు అవకాశం లేని ల్యాండ్ రికార్డులను సీడాక్ హైదరాబాద్ భాగస్వామ్యంతో అందజేస్తోంది. దీన్ని కూడా స్కోచ్ గుర్తించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ […]

Update: 2020-07-30 10:46 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి స్కోచ్ అవార్డుల పరంపర కొనసాగుతోంది. తాజాగా రెండు బంగారు, ఒక వెండి పతకాలను 66వ స్కోచ్ సమ్మిట్‌లో అందుకోనుంది. పాలనలో ఆధునిక సాంకేతిక నైపుణ్యం వినియోగానికి గుర్తింపు లభించింది. బ్లాక్ చెయిన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాజెక్టుకు ప్రెస్టిజియస్ గోల్డ్ అవార్డుకు ఎంపిక చేశారు. దీని ద్వారా ట్యాంపరింగ్‌కు అవకాశం లేని ల్యాండ్ రికార్డులను సీడాక్ హైదరాబాద్ భాగస్వామ్యంతో అందజేస్తోంది. దీన్ని కూడా స్కోచ్ గుర్తించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కార్యకలాపాల నిర్వహణకు బ్లాక్ చెయిన్ ఆధారిత వ్యవస్థ టి.చిట్స్‌కు సిల్వర్ మెడల్ లభించింది. ఇది రెండోసారి. గతంలో డీఏఆర్పీ, మెయిట్ వై లు నిర్వహించిన 23వ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ-గవర్నెన్స్ 2020 కింద కూడా ఎంపికైంది. డిజిటల్ ఇండియా కెటగిరీ కింద స్యాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బంగారు పతకం లభించింది.

2020 ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇయర్ గా ప్రకటించారు. ఆ క్రమంలోనే వీటిని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు హాజరైన క్రమంలోనూ పోలీసులకు ఉపయోగపడిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ సొల్యూషన్, సరైన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని గుర్తించేందుకు అమలు చేస్తోన్న మేధా చాట్ బోట్ విధానాన్ని కూడా స్కొచ్ గుర్తించింది. ఈ సందర్భంగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. మా కృషికి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు. గుడ్ గవర్నెన్స్‌లో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ద్వారా మెరుగైన సర్వీసులు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు రంగాల్లో స్కొచ్ అవార్డులను బహుకరించింది.

Tags:    

Similar News