వైద్య జంటకు కరోనా.. 16 వరకు లాక్‌డౌన్

తెలంగాణ రాష్ట్రంలో గురువారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 44కు చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 వరకు పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. కొత్తగా నమోదైన మూడు కేసుల్లో ఒక్కరు హైదరాబాద్ నగరం కుత్భల్లాపూర్ ప్రాంతానికి చెందినవారు. ఆమె ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కుత్భల్లాపూర్‌లో కంటైన్‌మెంట్ చర్యలు ప్రారంభించాయి. దోమలగూడ‌కు చెందిన భార్యభర్తలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. […]

Update: 2020-03-26 03:31 GMT

తెలంగాణ రాష్ట్రంలో గురువారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 44కు చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 వరకు పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. కొత్తగా నమోదైన మూడు కేసుల్లో ఒక్కరు హైదరాబాద్ నగరం కుత్భల్లాపూర్ ప్రాంతానికి చెందినవారు. ఆమె ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కుత్భల్లాపూర్‌లో కంటైన్‌మెంట్ చర్యలు ప్రారంభించాయి. దోమలగూడ‌కు చెందిన భార్యభర్తలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరు వైద్యులు కావడం గమనార్హం. ముగ్గురిని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తెలిపింది.

Tags:    

Similar News