సంగారెడ్డి జిల్లాలో మూడు గుడిసెలు దగ్ధం
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోహీర్ మండలం బడంపేట గ్రామంలో మూడు గిరిజనుల గుడిసెలు ప్రమాదవశాత్తు కాలి బూడిదయ్యాయి. ఇరాక్‌పల్లి తండా కు చెందిన మంగీ చౌహాన్, ప్రేమ్ చౌహన్, సంజు చౌహాన్ కుటుంబాలు ఆరు నెలల క్రితం బడంపేటకు వలస వచ్చాయి. అగ్నిప్రమాదంలో మంగి చౌహాన్‌కు చెందిన గుడిసెలో కూతురు పెళ్లి కోసం కొనుగోలు చేసిన నూతన వస్త్రాలు, బంగారం, నగదు, నిత్యావసరాలు కూడా పూర్తిగా దగ్ధమయ్యా యి. సూమారు రూ. లక్ష […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోహీర్ మండలం బడంపేట గ్రామంలో మూడు గిరిజనుల గుడిసెలు ప్రమాదవశాత్తు కాలి బూడిదయ్యాయి. ఇరాక్‌పల్లి తండా కు చెందిన మంగీ చౌహాన్, ప్రేమ్ చౌహన్, సంజు చౌహాన్ కుటుంబాలు ఆరు నెలల క్రితం బడంపేటకు వలస వచ్చాయి. అగ్నిప్రమాదంలో మంగి చౌహాన్‌కు చెందిన గుడిసెలో కూతురు పెళ్లి కోసం కొనుగోలు చేసిన నూతన వస్త్రాలు, బంగారం, నగదు, నిత్యావసరాలు కూడా పూర్తిగా దగ్ధమయ్యా యి. సూమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ కిషన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వెల్లడించారు.
Tags: fire accident, sangareddy district, ts news