మా భూమి మాకిచ్చేయండి.. ఒక్క స్థలం కోసం వేలాది మంది పోరుబాట
దిశ, శేరిలింగంపల్లి, మియాపూర్ : ఒకటే సర్వే నెంబర్, అందులో ఉన్నది 198 ఎకరాలు. దానికి నలుగురైదుగురు యాజమానులు. ఆ స్థలం కోసం వేలాదిమంది బాధ్యులు, వారికి నాలుగు సొసైటీలు, ఇబ్బడిముబ్బడిగా ఓనర్లు. కానీ, ప్లాట్లు ఉన్నవి వెయ్యిలోపే. అందులో స్థలాలు మావంటే మావంటూ వేలాది మంది బాధితులు రోడ్డెక్కారు. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ లింక్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సత్యసాయి సొసైటీకి చెందిన వందలాదిమంది బాధితులు సర్వే నెంబర్ 172లో ధర్నాకు […]
దిశ, శేరిలింగంపల్లి, మియాపూర్ : ఒకటే సర్వే నెంబర్, అందులో ఉన్నది 198 ఎకరాలు. దానికి నలుగురైదుగురు యాజమానులు. ఆ స్థలం కోసం వేలాదిమంది బాధ్యులు, వారికి నాలుగు సొసైటీలు, ఇబ్బడిముబ్బడిగా ఓనర్లు. కానీ, ప్లాట్లు ఉన్నవి వెయ్యిలోపే. అందులో స్థలాలు మావంటే మావంటూ వేలాది మంది బాధితులు రోడ్డెక్కారు. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ లింక్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సత్యసాయి సొసైటీకి చెందిన వందలాదిమంది బాధితులు సర్వే నెంబర్ 172లో ధర్నాకు దిగారు. ప్లాట్ల బాధితులు నినాదాలతో పాటు ఖాళీ స్థలంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు, పోలీసుల అడ్డగింతలతో పరిస్థితి రణరంగంగా మారింది. బాధితులు పెద్ద పెట్టున గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు బాధితులను అక్కడి నుండి తరలించారు. మరోవైపు ఇదే స్థలాల కోసం త్రివేణి వెల్ఫేర్ సొసైటీతో పాటు మరో రెండు సోసైటీలు కలిసి ఆ పక్కనే సమావేశం ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సర్వే నెంబర్ 172లో మాకు ప్లాట్లు ఉన్నాయంటే మాకు ఉన్నాయంటూ పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు.
నాటకీయ పరిణామాలు..
హైదర్ నగర్ డివిజన్‌లోని సర్వే నెంబర్ 172లోని 198 ఎకరాల భూములకు సంబంధించి ఆదివారం సత్యసాయి సొసైటీ, గోల్ద్ స్టోన్ ప్రసాద్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 40 ఏండ్లుగా కోర్టులో నానుతున్న ఈ స్థలంపై గత కొంతకాలంగా ఆయా సొసైటీలు క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ భూమిపై సొసైటీలకు అనుకూలంగా హైకోర్టు గతేడాది తీర్పు వెలువరించింది. దీంతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ స్థలాన్ని వర్టెక్స్ సంస్థకు డెవలప్మెంట్‌కు ఇచ్చేందుకు సత్యసాయి సొసైటీ సభ్యులు అంగీకారం తెలుపుతూ ఈరోజు మియాపూర్ నరేన్ గార్డెన్‌లో సమావేశం అయ్యి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సొసైటీలోని మరోవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతకుముందు సదరు స్ధలంలో ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలను గోల్డ్ స్టోన్ ప్రసాద్ వర్గానికి చెందిన వ్యక్తులు పూర్తిగా ధ్వంసం చేశారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ స్థలం ఎవరికి చెందుతుంది. అసలు ఓనర్లు ఎంతమంది. గోల్డ్ స్టోన్ ప్రసాద్, మాధవరం భాస్కర్ రావు, ఆయా సొసైటీలకు సంబంధించి ఎవరికి ఎంత స్థలం ఉంది. దాన్ని ఎవరికి ఎలా కేటాయించారు. ఈ స్థలంపై నెలకొన్న వివాదం, కోర్ట్ ఇష్యూలపై అటు భూ యజమానులు, సొసైటీ సభ్యులకు కూడా అంతు చిక్కకుండా పోయింది.
172 లో మేమే హక్కుదారులం.. సత్యసాయి సొసైటీ
172లో 1982లో వెంచర్ వేసిన సమయంలోనే కొన్ని వందల మందిమి స్థలాలు కొన్నాం. అప్పటి నుంచి వీటికి మేమే హక్కుదారులం. మధ్యలో డాక్యుమెంట్లు సృష్టించడం, స్థలం మాదంటూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. అయినా, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ స్థలం మాదే.