కరోనాపై పోరుకు 50 వేల మంది ‘ఎన్‌సీసీ ఆర్మీ’ రెడీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) సిద్ధమైంది. ఈ యుద్ధానికి దాదాపు 50వేల మంది క్యాడెట్‌లను ఎన్‌‌సీసీ సంసిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వారిని రంగంలోకి దింపింది కూడా. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు వీరిని అందించనుంది. కరోనాపై పోరుకు ఎన్‌సీసీ క్యాడెట్‌ల సేవలను వినియోగించుకోవాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆసక్తి గల 18ఏళ్లు నిండిన, ఆపై వయసున్న క్యాడెట్‌లు ముందుకు రావాలని ఎన్‌సీసీ సూచించిన విషయం తెలిసిందే. ఈ సూచనల మేరకు […]

Update: 2020-04-16 03:40 GMT

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) సిద్ధమైంది. ఈ యుద్ధానికి దాదాపు 50వేల మంది క్యాడెట్‌లను ఎన్‌‌సీసీ సంసిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వారిని రంగంలోకి దింపింది కూడా. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు వీరిని అందించనుంది. కరోనాపై పోరుకు ఎన్‌సీసీ క్యాడెట్‌ల సేవలను వినియోగించుకోవాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆసక్తి గల 18ఏళ్లు నిండిన, ఆపై వయసున్న క్యాడెట్‌లు ముందుకు రావాలని ఎన్‌సీసీ సూచించిన విషయం తెలిసిందే. ఈ సూచనల మేరకు ఇప్పటి వరకు 50వేల మంది క్యాడెట్‌లు ఈ ఆపత్కాలంలో దేశం దేశ నలుమూలల్లో సేవలందించేందుకు ముందుకు వచ్చారని ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చోప్రా తెలిపారు. గత 15 రోజుల్లో 14 రాష్ట్రాల్లో సుమారు 3,700 మంది క్యాడెట్‌లను ఇప్పటికే రంగంలోకి దించినట్టు వివరించారు. తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ క్యాడెట్‌లు సేవలందిస్తున్నారు. కేరళ, ఒడిశాల నుంచి క్యాడెట్‌ల కోసం విజ్ఞప్తులు వచ్చాయని చోప్రా వెల్లడించారు.

అత్యవసర సరుకులు, ఆహార పంపిణీకి, ట్రాఫిక్, ఏటీఎంల ఎదుట క్యూ చూసుకోవడం లాంటి పనుల్లో వీరి సహాయాన్ని రాష్ట్రాలు కోరబోతున్నాయి. సర్కారులు హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ఏరియాల్లో, లా అండ్ ఆర్డర్ సమస్యలున్న చోటుకు వీరిని పంపించబోరు. జీతం కోసం కాకుండా స్వచ్ఛందంగా వచ్చి సేవలందించే ఎన్‌సీసీ క్యాడెట్‌లలో ప్రజలు తమ పిల్లలను చూసుకుంటారని, అందుకే ఈ క్యాడెట్‌లపట్ల ప్రజలు సానుకూలంగా ఉంటారని, వారు చెప్పింది వింటారని చోప్రా వివరించారు.

TAGS: NCC, deploy, volunteer, help, law and order

Tags:    

Similar News