నేషనల్ హైవేగా ఆ రెండు రహదారులు

దిశ,ఖమ్మం : తెలంగాణలోని రెండు రహదారుల్ని నేషనల్ హైవేలుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. NH-167 పై మహబూబ్ నగర్ నుంచి కొడంగల్, తాండూరు, కర్ణాటకలోని చించొలీ ద్వారా కర్ణాటకలోని బాపూర్ జంక్షన్ తో అనుసంధానం చేస్తున్న ఈ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ 167-N గా ప్రకటించింది. అలాగే NH-30 పై కొత్తగూడెం నుంచి ఇల్లందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు, వలిగొండ ద్వారా వెళ్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి దగ్గర […]

Update: 2021-04-09 21:54 GMT

దిశ,ఖమ్మం : తెలంగాణలోని రెండు రహదారుల్ని నేషనల్ హైవేలుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. NH-167 పై మహబూబ్ నగర్ నుంచి కొడంగల్, తాండూరు, కర్ణాటకలోని చించొలీ ద్వారా కర్ణాటకలోని బాపూర్ జంక్షన్ తో అనుసంధానం చేస్తున్న ఈ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ 167-N గా ప్రకటించింది. అలాగే NH-30 పై కొత్తగూడెం నుంచి ఇల్లందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు, వలిగొండ ద్వారా వెళ్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి దగ్గర కనెక్ట్ అయ్యే రహదారికి కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్ హెచ్-930 P గా ప్రకటించింది.

Tags:    

Similar News