ఈ ఏడాది గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగరేయనున్న కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఈ ఏడాది గోల్కొండ కోటపైనే పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ మువ్వన్నెల జెండాను ఎగరేయనున్నారు. కాగా, కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కొద్దిమంది మంత్రులు, అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జెండా ఎగురవేశారు. […]

Update: 2021-08-09 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఈ ఏడాది గోల్కొండ కోటపైనే పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ మువ్వన్నెల జెండాను ఎగరేయనున్నారు.

కాగా, కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కొద్దిమంది మంత్రులు, అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జెండా ఎగురవేశారు. ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల పంపిణీలు ఉండబోవని ప్రజల, విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా వేడుకలు చాలా నిరాడంబరంగా నిర్వహించారు.

Tags:    

Similar News