ఈనెల 12న కేఎంసీ ప్రారంభం

దిశ ప్రతినిధి, వరంగల్: కేఎంసీలో 250 పడకలకు గానూ ప్రస్తుతం కొవిడ్ పేషేంట్లకు చికిత్స అందించేందుకు 120 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, ఈ నెల 12న హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కొవిడ్ బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి, ఎంజీఎంలో సమస్యలు చక్కదిద్దేందుకు కేఎంసీ ఆవరణలో పీ.ఎం.ఎస్,ఎస్.వై నిధులతో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ హరితతో కలిసి […]

Update: 2020-08-04 01:48 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: కేఎంసీలో 250 పడకలకు గానూ ప్రస్తుతం కొవిడ్ పేషేంట్లకు చికిత్స అందించేందుకు 120 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, ఈ నెల 12న హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కొవిడ్ బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి, ఎంజీఎంలో సమస్యలు చక్కదిద్దేందుకు కేఎంసీ ఆవరణలో పీ.ఎం.ఎస్,ఎస్.వై నిధులతో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ హరితతో కలిసి మంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు- ఉద్యోగులు ప్రాణాలకు తెగించిసేవలు అందిస్తున్నరని అన్నారు. ఎంజీఎంలో ఇప్పుడున్న కోవిడ్ వార్డుతో పాటు అదనంగా మరో 200 బెడ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కరోనా సమస్యను రాజకీయం చేయవద్దని, అబద్ధాలు,తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. మాజీ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కేవలం ఆరోగ్యం బాగులేక పోవడం, ఆయన కుటుంబ సభ్యులు అంతా కరోనా బారిన పడడం వల్లే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఆ రాజీనామాను రాజకీయం చేయవద్దని కోరారు. కరోనా రోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రజలు కరోనా బాధితులను శత్రువులుగా, అంటరాని వారిగా చూడడం సరికాదన్నారు.

ఎంజీఎంలో ప్రతి కరోనా పేషేంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా సేవలు అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామంగా చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని‌ మంత్రి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News