ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై స్థానికులు ఏం చెబుతున్నారంటే..?

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదాన్ని మొదట స్థానికులు గుర్తించారు. హెలికాప్టర్ కూలిన సమయంలో భారీ స్థాయిలో శబ్దం వచ్చిందని ఘటనాస్థలానికి సమీపంలో పనులు చేసుకుంటున్న ప్రజలు పేర్కొన్నారు. ఆ శబ్ధాలను విని వెంటనే అక్కడకు చేరుకుని బకెట్లతో నీటిని చల్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కూనూర్‌లో ప్రత్యక్ష సాక్షి మాట్లాడారు. ‘‘పెద్ద శబ్దం వినిపించిందని, హెలికాప్టర్ కాలిపోతున్నట్లు చూశానని, ముగ్గురు వ్యక్తులు చెట్లపై నుంచి కింద పడిపోయారని, మంటలు చెలరేగడంతో […]

Update: 2021-12-08 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదాన్ని మొదట స్థానికులు గుర్తించారు. హెలికాప్టర్ కూలిన సమయంలో భారీ స్థాయిలో శబ్దం వచ్చిందని ఘటనాస్థలానికి సమీపంలో పనులు చేసుకుంటున్న ప్రజలు పేర్కొన్నారు. ఆ శబ్ధాలను విని వెంటనే అక్కడకు చేరుకుని బకెట్లతో నీటిని చల్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కూనూర్‌లో ప్రత్యక్ష సాక్షి మాట్లాడారు. ‘‘పెద్ద శబ్దం వినిపించిందని, హెలికాప్టర్ కాలిపోతున్నట్లు చూశానని, ముగ్గురు వ్యక్తులు చెట్లపై నుంచి కింద పడిపోయారని, మంటలు చెలరేగడంతో పెద్దగా ఏమీ చేయలేకపోయామని కృష్ణస్వామి అనే వ్యక్తి చెప్పారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న అటవీ మంత్రి రామసుందరం, ప్రజా పనుల శాఖ జిల్లా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరోవైపు చెన్నయ్‌లోని సచివాలయంలో ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు తదితర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఆదేశించారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన కోయంబత్తూరు వెళ్లనున్నారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో 11 మంది దుర్మరణం…శోకసంద్రంలో ఆర్మీ వర్గాలు

Tags:    

Similar News