‘హే రామ్’.. రెమ్యునరేషన్ రిస్ట్‌వాచా?

హే రామ్… సూపర్‌స్టార్ కమల్‌హాసన్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఈ సినిమాలో ఆయన నటుడిగానే కాదు రచయితగా, దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కమల్‌హాసన్‌తో‌పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పోషించిన అంజద్ అలీఖాన్ పాత్ర ప్రేక్షులకు గుర్తుండిపోయింది. కమల్‌కు స్నేహితుడిగా కనిపించే ఈ పాత్ర కోసం షారుక్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమల్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేరామ్ మూవీ కోసం షారుక్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి మాట్లాడాడు. ఇంతకీ […]

Update: 2020-02-18 07:33 GMT

హే రామ్… సూపర్‌స్టార్ కమల్‌హాసన్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఈ సినిమాలో ఆయన నటుడిగానే కాదు రచయితగా, దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కమల్‌హాసన్‌తో‌పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పోషించిన అంజద్ అలీఖాన్ పాత్ర ప్రేక్షులకు గుర్తుండిపోయింది. కమల్‌కు స్నేహితుడిగా కనిపించే ఈ పాత్ర కోసం షారుక్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమల్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేరామ్ మూవీ కోసం షారుక్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి మాట్లాడాడు. ఇంతకీ షారుక్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?‌ అక్షరాల ఒక చేతి గడియారం. అవును.. నిర్మాత నుంచి షారుక్ తీసుకుంది అదేనట. బడ్జెట్ అప్పటికే ఎక్కువై పోవడంతో షారుక్ ఎలాంటి డబ్బు ఆశించకుండానే సినిమా చేశారట. కేవలం పాత్ర ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తెస్తుందని, జనాన్ని ఆలోచింపచేస్తుందనే ఉద్దేశంతోనే సినిమాకు కమిట్ అయ్యారట షారుక్.

ఈ సందర్భంగా షారుక్‌కు సినిమాపట్ల ఉన్న అభిమానం, ప్రేమ గురించి కీర్తించారు కమల్. సాధారణంగా షారుక్‌ను బిజినెస్ మ్యాన్ అని, కమర్షియల్ మైండ్ అని చాలామంది అంటుంటారు. కానీ, షారుక్ అలా కాదని, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషని కొనియాడారు. కాగా హేరామ్ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి కావడంతో ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు కమల్.

Tags:    

Similar News