ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘బర్గర్’.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, ఫీచర్స్ : చాలామంది ఫేవరేట్ ఫాస్ట్‌ఫుడ్ ఐటెమ్స్‌లో ‘బర్గర్’ ఒకటి. సాధారణంగా రెండు బన్నుల మధ్యలో కాస్త చికెన్, జున్ను ముక్కలు, కొన్ని కూరగాయాలు వేసి అందంగా డెకోరేట్ చేసి సర్వ్ చేస్తుంటారు. ఇక గోల్డ్ లీఫ్, ట్రఫుల్స్, వైన్ వంటి పదార్థాలను బర్గర్‌కు జోడించి వీటి రుచిని, విలువను పెంచేందుకు చెఫ్‌లు పోటీపడుతుంటారు. ఈ చెఫ్ వార్స్‌కు అంతముండదు. ఈ క్రమంలోనే నెదర్లాండ్‌కు చెందిన చెఫ్ రాబర్ట్ జాన్ డి వీన్ ప్రపంచంలోనే అత్యంత […]
దిశ, ఫీచర్స్ : చాలామంది ఫేవరేట్ ఫాస్ట్‌ఫుడ్ ఐటెమ్స్‌లో ‘బర్గర్’ ఒకటి. సాధారణంగా రెండు బన్నుల మధ్యలో కాస్త చికెన్, జున్ను ముక్కలు, కొన్ని కూరగాయాలు వేసి అందంగా డెకోరేట్ చేసి సర్వ్ చేస్తుంటారు. ఇక గోల్డ్ లీఫ్, ట్రఫుల్స్, వైన్ వంటి పదార్థాలను బర్గర్‌కు జోడించి వీటి రుచిని, విలువను పెంచేందుకు చెఫ్‌లు పోటీపడుతుంటారు. ఈ చెఫ్ వార్స్‌కు అంతముండదు. ఈ క్రమంలోనే నెదర్లాండ్‌కు చెందిన చెఫ్ రాబర్ట్ జాన్ డి వీన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ తయారుచేసి గత రికార్డులను బద్దలు కొట్టాడు.
బర్గర్‌లయందూ ‘ది గోల్డెన్ బాయ్’ బర్గర్ వేరయా. ఎందుకంటే.. కోపి లువాక్ కాఫీ, మాకాల్లన్ సింగిల్ మాల్ట్ విస్కీ, బాతు గుడ్లతో తయారు చేసిన కుంకుమపువ్వు, 100 శాతం వాగ్యు ఎ5, బెలూగా కేవియర్, కింగ్ క్రాబ్, వైట్ ట్రఫుల్ ఇతర ప్రీమియం పదార్ధాలతో డచ్ రెస్టారెంట్ డి డాల్టన్స్ యజమాని రాబర్ట్ జాన్ డి వీన్ బర్గర్‌ను రూపొందించాడు. బర్గర్ చేయడం పూర్తయిన తర్వాత, దాన్ని ఓ సీసాలో పెట్టి, విస్కీ ప్రేరేపిత పొగను దానికి పట్టించాడు. బంగారు ఆకుల్లో చుట్టిన ఈ బర్గర్ పేరు ‘ది గోల్డెన్ బాయ్’ కాగా దీని ధర 6వేల డాలర్లు. ప్రపంచంలోనే కాస్లియెస్ట్ బర్గర్‌గా నిలిచిన ఈ లగ్జరీయస్, డెలీషియస్, జ్యూసీ బర్గర్ తినాలనుకుంటే మీరు కనీసం రెండు వారాల ముందుగానే రిజర్వు చేసుకోవాలి. అంతేకాదు బర్గర్‌కు 15% డౌన్‌పేమెంట్ ముందే చెల్లించాలి.
2011లో 352 కి.గ్రాముల బరువుతో ఒరెగాన్ రెస్టారెంట్ ఒక బర్గర్‌ను తయారుచేసింది. దానివిలువ అక్షరాల 6 వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.4,46,925). కాగా ప్రపంచంలోనే ఖరీదైన బర్గర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విషయం తెలుసుకున్న రాబర్ట్ దానికంటే ఖరీదైన బర్గర్ చేయాలని నిశ్చయించుకోవడంతో పాటు ప్రస్తుతం అది నిజం చేశాడు.
‘రెండేళ్ల నుంచి రెస్టారెంట్లు మూతపడ్డాయి. మహమ్మారి కారణంగా ఆహార పోటీలు లేవు. టేక్ అవే సర్వీస్ కొనసాగుతున్నప్పటికీ, కస్టమర్స్ అంతగా రావడం లేదు. ప్రజల బాధలతో పాటు రెస్టారెంట్ పరిశ్రమ దుర్భరమైన పరిస్థితిని చూస్తే బాధగా ఉంది. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌ను తయారుచేశాను. గోల్డెన్ బాయ్ కోసం రెసిపీని సరిగ్గా పొందడానికి కొంత సమయం పట్టింది. ఎన్నో ట్రయల్ అండ్ ఎర్రర్స్ తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ ది బెస్ట్‌గా వచ్చింది. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తాను. ఈ విధంగానైన సమాజానికి కొంత సేవ చేస్తాను’ అని రాబర్ట్ అన్నారు.