ఈ ‘డాగ్’ వెరీ స్పెషల్.. పాప కోసం ఏం చేసిందో తెలుసా..
దిశ, ఫీచర్స్ : విశ్వాసానికి ప్రతీకగా నిలిచే జాగిలాలు, మనుషులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఫ్యామిలీలో ఓ మెంబర్‌లా కలిసిపోతుంటాయి. ఇక ప్రజెంట్ టైమ్స్‌లో అయితే ఇంటికొక శునకం ఉండనే ఉంటుంది. ఇంటికి కాపలాగా ఉండటమే కాకుండా ఇంటి సభ్యుల కోసం స్ట్రెస్ బస్టర్ పాత్రను కూడా పోషిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ చిన్నారి కోసం ఫోన్‌ను నోటితో పట్టుకుని, స్టాండ్‌గా మారిన డాగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఆనందపడుతున్నారు. […]
దిశ, ఫీచర్స్ : విశ్వాసానికి ప్రతీకగా నిలిచే జాగిలాలు, మనుషులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఫ్యామిలీలో ఓ మెంబర్‌లా కలిసిపోతుంటాయి. ఇక ప్రజెంట్ టైమ్స్‌లో అయితే ఇంటికొక శునకం ఉండనే ఉంటుంది. ఇంటికి కాపలాగా ఉండటమే కాకుండా ఇంటి సభ్యుల కోసం స్ట్రెస్ బస్టర్ పాత్రను కూడా పోషిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ చిన్నారి కోసం ఫోన్‌ను నోటితో పట్టుకుని, స్టాండ్‌గా మారిన డాగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఆనందపడుతున్నారు.
Why everyone needs a dog in their life pic.twitter.com/1hAbWoyPha
— The Sun (@TheSun) March 14, 2021
బ్రిటిష్ మీడియా సంస్థ ‘ది సన్’ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ కుక్క వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో ఓ చిన్నారి ఫోన్‌లో ఏదో ప్రోగ్రామ్ చూస్తుండగా, కుక్క తన నోటితో ఫోన్ పట్టుకుని స్టాండ్‌గా మారిపోయి.. కదలకుండా అలానే నిల్చుంది. మొబైల్‌లో వీడియో చూస్తున్న ఆ చిన్నారికి ఎలాంటి డిస్ట్రబెన్స్ కలగకుండా ఫోన్‌ను జాగ్రత్తగా నోట్లో పెట్టుకున్న డాగ్‌ను చూసి నెటిజన్లు ‘వావ్’ అంటున్నారు. మానవజాతికి గొప్ప స్నేహితులు జాగిలాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు శునకాలను పెంచుకోవాలని పోస్టులు పెడుతున్నారు. జాగిలాలు విశ్వాసానికి మారు పేరు అని చెప్పేందుకు ఈ వీడియోనే సాక్ష్యమని అంటున్నారు.