కదిలే ట్రక్‌లో విహరిస్తూ.. నచ్చిన ఫుడ్ తినే చాన్స్!
దిశ, ఫీచర్స్ : ఆకాశంలో నక్షత్రాలను చూసుకుంటూ మనకు నచ్చిన ఫుడ్ తింటే ఎంత బాగుంటుందో కదా! ఇలాంటి అనుభూతిని పంచేందుకు పలు చోట్ల రూఫ్ టాప్ రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా.. కదిలే ట్రక్‌లో రూఫ్ టాప్ డైనింగ్ టేబుల్‌పై కూర్చుని, నచ్చిన ఫుడ్ తింటుంటే ఆ కిక్కే వేరు! ఇక ఈ ఫుడ్ ట్రక్ విషయానికొస్తే.. ఏకకాలంలో సిటీని చుట్టేయడంతో పాటు మనకు కావాల్సిన ఫుడ్ తినేయొచ్చు. కాగా ఢిల్లీలోని గుర్గావ్‌లో కస్టమర్లకు […]
దిశ, ఫీచర్స్ : ఆకాశంలో నక్షత్రాలను చూసుకుంటూ మనకు నచ్చిన ఫుడ్ తింటే ఎంత బాగుంటుందో కదా! ఇలాంటి అనుభూతిని పంచేందుకు పలు చోట్ల రూఫ్ టాప్ రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా.. కదిలే ట్రక్‌లో రూఫ్ టాప్ డైనింగ్ టేబుల్‌పై కూర్చుని, నచ్చిన ఫుడ్ తింటుంటే ఆ కిక్కే వేరు! ఇక ఈ ఫుడ్ ట్రక్ విషయానికొస్తే.. ఏకకాలంలో సిటీని చుట్టేయడంతో పాటు మనకు కావాల్సిన ఫుడ్ తినేయొచ్చు. కాగా ఢిల్లీలోని గుర్గావ్‌లో కస్టమర్లకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అందించే ఫుడ్ ట్రక్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసలు ఈ ఫుడ్ ట్రక్‌లు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే..
గుర్గావ్‌కు చెందిన అపూర్వ్ గోయల్, రాహుల్ గోయల్, అన్విత్ పలివల్.. కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడే ఫుడ్ ట్రక్ విత్ రూఫ్ టాప్ డైనింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. ఈ మేరకు 2016 అక్టోబర్‌లో ‘ఫుడ్ రాత్(Food Rath)’ పేరిట బిజినెస్ ప్రారంభించారు. ఫుడ్ ట్రక్ కాన్సెప్ట్ రొటీన్ అయిన్పటికీ.. ‘రూఫ్ టాప్ విత్ డైనింగ్ ప్లస్ మూవింగ్’ స్పెషాలిటీతో ‘ఫుడ్ రాత్’కు యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఫుడ్ ట్రక్ రూఫ్ టాప్‌ను చైర్స్, డైనింగ్ టేబుల్‌తో అందంగా అలంకరించడం ద్వారా అది సెల్ఫీ పాయింట్ కూడా అవుతోంది. రూ.600/- చెల్లించి ఇద్దరు కస్టమర్లు ఈ ఫుడ్ ట్రక్‌లో తమకు నచ్చిన ట్రెండీ ఫుడ్ ఆర్డర్ చేసి తినొచ్చు. మెనూలో రాజస్థానీ ఫుడ్, మొఘలాయి డిషెస్, టిక్కాస్, చికెన్, మటన్, రోగన్ జోష్, మఖాని ఇంకా ఇతర ఫుడ్ ఐటెమ్స్ ఉండటం విశేషం.