వాయిస్ విని కరోనా ఉందో లేదో చెప్పేస్తున్న యాప్.. మీరూ ట్రై చేయండి!
దిశ, ఫీచర్స్ : కొవిడ్ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. అందులోనూ 90శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. పాజిటివ్ వస్తుండడంతో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. దేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కాగా, మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి. ఈ నేపథ్యంలో ఒంట్లో కాస్త నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చినా కొవిడ్ వచ్చిందేమోనన్న అనుమానంతో టెస్ట్ చేయించుకోవడానికి మొగ్గు చూపుతాం. కానీ పరీక్షలకు వెళ్లి వైరస్ బారిన పడే […]
దిశ, ఫీచర్స్ : కొవిడ్ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. అందులోనూ 90శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. పాజిటివ్ వస్తుండడంతో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. దేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కాగా, మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి. ఈ నేపథ్యంలో ఒంట్లో కాస్త నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చినా కొవిడ్ వచ్చిందేమోనన్న అనుమానంతో టెస్ట్ చేయించుకోవడానికి మొగ్గు చూపుతాం. కానీ పరీక్షలకు వెళ్లి వైరస్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. ఈ క్రమంలో వచ్చిన ఓ యాప్ ఈ సమస్యకు అద్భుత పరిష్కారం చూపుతోంది. అదే ‘వోకలిస్ చెక్’ (VocalisCheck). కేవలం మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది ఈ యాప్.
‘వోకలిస్ చెక్ ఓపెన్ చేశాక.. అందులో 50 నుంచి 70 వరకు అంకెలను గట్టిగా లెక్కపెట్టాలి. మనం చెప్పిన ఆ ఆడియో రికార్డ్ అవుతుంది. ఈ ఆడియో స్పెక్టోగ్రామ్‌గా మారి, హీట్ ఇమేజ్‌లాగా కనిపిస్తుంది. అప్పుడీ హీట్ మ్యాప్.. కొవిడ్ పేషెంట్ల ఆడియోతో పోల్చి కరోనా ఉందో లేదో నిర్ధారిస్తుంది. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్ కంపెనీ వోకలిస్ హెల్త్ ఈ యాప్‌ను డెవలప్ చేయగా.. ఇప్పటికే ఉన్న నమూనాల డేటాబేస్‌కు మీ వాయిస్ లక్షణాలను సరిపోల్చడానికి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)ను ఉపయోగిస్తుంది. కరోనా వల్ల ఎంత ప్రమాదంలో ఉన్నారో కేవలం రెండు నిమిషాల్లోనే చెప్పేస్తున్న ఈ యాప్‌ను.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబైతో కలిసి వోకలిస్ హెల్త్ కంపెనీ టెస్ట్ చేసింది. 2000 మంది పేషెంట్ల ఆడియోను హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, గుజరాతీ భాషల్లో రికార్డు చేసి పరీక్షించింది. ఇందులో 81.2 శాతం సక్సెస్ రేట్ రావడం విశేషం.
కరోనా టెస్ట్ కోసం పైసా ఖర్చుచేయకుండా, అతి తక్కువ టైమ్‌లో ఈ యాప్‌తో కరోనా ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా సులభమని వోకలిస్ హెల్త్ సంస్థ కో ఫౌండర్ షేడీ హసన్ తెలిపారు. ఏఐ అల్గారిథమ్స్ వాయిస్ నమూనా నుంచి 512 విభిన్న లక్షణాలను సేకరించేందుకు యాప్‌ను రూపొందించారు. అయితే కొవిడ్ డిటెక్షన్ కోసం.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాల ఆధారంగా ఈ అల్గారిథం కరోనా పాజిటివ్ అవునా? కాదా? అనే విషయాన్ని చెబుతుంది. ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసిన వోకలిస్ యాప్ మాత్రం ఊహించిన విధంగా పనిచేయడం లేదని, లోడ్ అవుతున్న సమయంలో క్రాష్ అవుతుందని చెబుతున్నారు నెటిజన్లు.