స్వర్ణ కారులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం.. చార్మినార్ సాక్షిగా సంచలనం రేపిన ఘటన
దిశ, చార్మినార్ : బంగారంలో హాల్ మార్క్ 91.6 నగలు చేయాలని బెంగాలీ స్వర్ణకారులకు ఆర్డర్ ఇచ్చాడు ఓ జ్యూవెల్లరీ షాపు యజమాని .. సంవత్సరంన్నర నుంచి బంగారం పనులు ఇస్తున్నా నాణ్యతలో మార్పులేదు. ఇప్పటివరకు కేజీ బంగారం నొక్కేశారనే ఆరోపణతో జ్యూవెల్లరీ షాప్ యజమాని తన ఐదుగురు అనుచరులతో కలిసి ముగ్గురు బెంగాలీ స్వర్ణ కారులను నిర్బంధించి విచక్షణారహితంగా దాడులు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒళ్ళంతా హూనం చేశారు. పైగా వీడియోలు తీస్తూ పైశాచిక […]
దిశ, చార్మినార్ : బంగారంలో హాల్ మార్క్ 91.6 నగలు చేయాలని బెంగాలీ స్వర్ణకారులకు ఆర్డర్ ఇచ్చాడు ఓ జ్యూవెల్లరీ షాపు యజమాని .. సంవత్సరంన్నర నుంచి బంగారం పనులు ఇస్తున్నా నాణ్యతలో మార్పులేదు. ఇప్పటివరకు కేజీ బంగారం నొక్కేశారనే ఆరోపణతో జ్యూవెల్లరీ షాప్ యజమాని తన ఐదుగురు అనుచరులతో కలిసి ముగ్గురు బెంగాలీ స్వర్ణ కారులను నిర్బంధించి విచక్షణారహితంగా దాడులు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒళ్ళంతా హూనం చేశారు. పైగా వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు జ్యూవెల్లరీ షాపు యజమాని అనుచరగణం. వారి చిత్రహింసలు భరించలేక బాధితులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే… చేలాపురాకు చెందిన ప్రతీఫ్ జైన్ జ్యూవెల్లరీ దుకాణం యజమాని.