భారత్‌లో కరోనా@128
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనావైరస్ పంజావిసురుతున్నది. మనదేశంలో కరోనా పాజిటివ్ మొదటి కేసు జనవరి 30 కేరళలో నమోదైంది. తర్వాత కూడా వైరస్ పెద్దగా వ్యాప్తి చెందనట్టే కనిపించింది. కానీ, ఈ నెలలోనే కరోనా విజృంభించినట్టు తెలుస్తున్నది. వారం క్రితం మనదేశంలో కరోనా పాజిటివ్ కేసులు 60 లోపే ఉండగా.. నేడు ఈ సంఖ్య 128(రాష్ట్రాలవారీగా చూస్తే)కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. 126 కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా నోయిడాలో రెండు, కర్ణాటకలో […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనావైరస్ పంజావిసురుతున్నది. మనదేశంలో కరోనా పాజిటివ్ మొదటి కేసు జనవరి 30 కేరళలో నమోదైంది. తర్వాత కూడా వైరస్ పెద్దగా వ్యాప్తి చెందనట్టే కనిపించింది. కానీ, ఈ నెలలోనే కరోనా విజృంభించినట్టు తెలుస్తున్నది. వారం క్రితం మనదేశంలో కరోనా పాజిటివ్ కేసులు 60 లోపే ఉండగా.. నేడు ఈ సంఖ్య 128(రాష్ట్రాలవారీగా చూస్తే)కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. 126 కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా నోయిడాలో రెండు, కర్ణాటకలో రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా, ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు కరోనావైరస్ బారిన పడి మరణించారు. కర్ణాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ వృద్ధురాలు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్రలోని కస్తుర్బా హాస్పిటల్‌లో 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి చెందాడు.
కరోనాతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరవుతున్నది. మనదేశంలో అత్యధిక కేసులు(39) ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దీంతో చుట్టపక్కల రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర నుంచి సాగించే రాకపోకలపై గట్టి నిఘా వేశాయి. కాగా, మహారాష్ట్రలో కరోనా అనుమానితులను క్వారంటైన్‌లో పెట్టే పని ముమ్మరంగా సాగుతున్నది. అనుమానిత వ్యక్తులు స్వచ్ఛందంగా ఇంటికాడే ఏకాంతవాసంలో ఉండే అవకాశాన్ని కల్పిస్తూ.. ఆ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అంతేకాదు, ముందుజాగ్రత్తగా.. స్వచ్ఛందంగా క్వారంటైన్‌లో ఉంటున్నవారి ఎడమ చేతికి ‘హోం క్వారంటైన్’ అనే అక్షరాలతో స్టాంప్ కూడా వేస్తున్నారు.
మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు కేరళ(24)లో వెలుగుచూశాయి. ఏపీలో ఒక్కరికి, తెలంగాణలో నలుగురికి కరోనా పాజిటివ్ తేలగా.. మన రాష్ట్రంలో ఈ వైరస్ బారి నుంచి ఒకరు కోలుకున్నారు. కాగా, మొత్తం 15 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది.
మనదేశంలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతైన కరోనా కేసులే ఉన్నాయి. కుటుంబాల్లో ఒకరి నుంచి మరొకరి(రెండో దశ) సోకిన ఘటనలు స్వల్పం. అయితే, సామూహిక వ్యాప్తి(మూడో దశ)ని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే పాఠశాలు, సినిమా హాళ్లు, సభలు, వేడుకలు, జిమ్‌లు, మ్యూజియాలకు సర్కారు తాళం వేసింది. తాజ్ మహల్, ఎర్రకోట, రాజ్‌ఘాట్, అజంతా ఎల్లోరా, సెంట్రల్ మ్యూజియాల సందర్శనను నిలిపివేసింది.
కాగా, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై కేంద్రం ఆంక్షలు విధించింది. యూఏఈ, ఖతర్, ఒమన్, కువైట్ నుంచి నేరుగా లేదా ట్రాన్సిట్(వయా!) ద్వారానైనా వచ్చే ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని(రేపటి నుంచి అమలు) ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు, టర్కీ, యూకే దేశాల నుంచి ప్రయాణికులందరినీ(విదేశీయులను, భారతీయులనూ) దేశంలోకి అనుమతి(రేపటి నుంచి అమలు)ని నిరాకరించింది. అలాగే, ఫిలిప్పీన్స్, అఫ్ఘనిస్తాన్, మలేషియా దేశాల నుంచి ప్రయాణాలను రద్దు చేసింది. ఈ నెల 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్రం వెల్లడించింది.
tags : coronavirus, india, 128 cases, thee deaths, quarantine, stamped, travel advisory