ఆ ఓటమికి బూమ్రా నోబాలే కారణం: భువనేశ్వర్
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయినా సొంత జట్టు సభ్యులపై విమర్శలు చేయడం అరుదే. కానీ, అనూహ్యంగా టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ తన సహచర బౌలర్ జస్ప్రీత్ బూమ్రాపై ఆరోపణలు చేశాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో ఓడిపోవడానికి బూమ్రా వేసిన నోబాలే కారణమని వ్యాఖ్యానించాడు. ‘ఆ రోజు పాక్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్‌కు బూమ్రా వేసిన బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ధోనీ చేతిలో పడింది. కానీ, ఆ బంతి నోబాల్ అని అంపైర్ […]
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయినా సొంత జట్టు సభ్యులపై విమర్శలు చేయడం అరుదే. కానీ, అనూహ్యంగా టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ తన సహచర బౌలర్ జస్ప్రీత్ బూమ్రాపై ఆరోపణలు చేశాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో ఓడిపోవడానికి బూమ్రా వేసిన నోబాలే కారణమని వ్యాఖ్యానించాడు. ‘ఆ రోజు పాక్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్‌కు బూమ్రా వేసిన బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ధోనీ చేతిలో పడింది. కానీ, ఆ బంతి నోబాల్ అని అంపైర్ డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఫకర్ 114 పరుగులు చేసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ ఛేదనలో పూర్తిగా విఫలం కావడంతో 180 పరుగుల తేడాతో పాక్ టైటిల్ గెలిచింది. ఫకర్ లేకుంటే పాకిస్తాన్ 338 పరుగులు చేసేది కాదు. అదే సమయంలో భారీ స్కోర్ చూసి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ కూడా బెంబేలెత్తిపోయేవారు కాదు’ అని భువీ చెప్పాడు.