ఫైనాన్స్ కంపెనీల్లో Gold Loan తీసుకుంటున్నారా?.. మీ పాకెట్ ఖాళీ..
దిశ, వెబ్‌డెస్క్ : అసలే కరోనా కాలం.. ఉద్యోగాలు కోల్పోయి కొందరు ఇబ్బందులు పడుతుంటే.. ఆర్ధికంగా మరికొందరు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పు కోసం ఎవరిని అడిగినా నో చెప్పే అవకాశాలే ఎక్కువ. ఇలాంటి సమయంలోనే కొందరు బంగారాన్ని తనఖా పెట్టి లోన్, బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. దీంతో వెంటనే రుణాలు పొందుతున్నారు. ఈ మేరకు బ్యాంకులు, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. అయితే.. మీరు గోల్డ్ లోన్ ఎక్కడ తీసుకుంటున్నారు అన్న […]
దిశ, వెబ్‌డెస్క్ : అసలే కరోనా కాలం.. ఉద్యోగాలు కోల్పోయి కొందరు ఇబ్బందులు పడుతుంటే.. ఆర్ధికంగా మరికొందరు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పు కోసం ఎవరిని అడిగినా నో చెప్పే అవకాశాలే ఎక్కువ. ఇలాంటి సమయంలోనే కొందరు బంగారాన్ని తనఖా పెట్టి లోన్, బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. దీంతో వెంటనే రుణాలు పొందుతున్నారు. ఈ మేరకు బ్యాంకులు, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. అయితే.. మీరు గోల్డ్ లోన్ ఎక్కడ తీసుకుంటున్నారు అన్న విషయం ఎంతో కీలకం. ఎందుకు అనుకుంటున్నారా.. బ్యాంకుల్లో కాకుండా ఫైనాల్స్ కంపెనీల్లో గోల్డ్ లోన్ తీసుకుంటే.. వడ్డీ మీ నడ్డి విరిచే అవకాశం ఉంటుంది.
క్లియర్‌గా తెలుసుకోండి..
బ్యాంకుల్లో, ఫైనాన్స్ కంపెనీల్లో వడ్డీ రేట్లలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 7 శాతం నుంచి వడ్డీ రేటుతో గోల్డ్ లోన్స్ అందిస్తున్నాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 7 శాతం నుంచి 7.5 శాతం వడ్డీతో బంగారు రుణాలు ఆఫర్ చేస్తోంది. కెనరా బ్యాంక్‌లో 7.35 శాతం వడ్డీ రేటుతో లోన్ పొందొచ్చు. పీఎన్‌బీలో అయితే 8.75 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమౌతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 7.35 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది.
అదే గోల్డ్ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీల్లో అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థల్లో వడ్డీ రేటు 9.24 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు మీరు బంగారంపై రూ.2 లక్షలు లోన్ తీసుకున్నారని అనుకుందాం. 7 శాతం వడ్డీ రేటుతో అయితే మీకు ఏడాదికి రూ.7600 వరకు వడ్డీ పడుతుంది. అదే 24 శాతం వడ్డీ రేటు అయితే రూ. 27 వేలు కట్టాలి. అందుకే వడ్డీ రేటు విషయంలో ఆలోచించి స్టెప్పు తీసుకోవడం ఎంతో అవసరం.