కొవిడ్‌పై విజయం.. మాస్క్ ఫ్రీగా కంట్రీస్!

దిశ, ఫీచర్స్ : కరోనా సెకండ్ వేవ్‌తో ఇండియా మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రతీరోజు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేస్తూ.. కొవిడ్ కట్టడికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో పరిస్థితి ఈ విధంగా ఉంటే, కొన్ని దేశాలు మాత్రం మహమ్మారిపై విజయం సాధించి మాస్క్ ఫ్రీ కంట్రీస్‌గా మారబోతున్నాయి. ఆ దేశాలేవో తెలుసుకుందాం.. భూటాన్ : చైనా, భారత్‌తో […]

Update: 2021-05-21 07:50 GMT

దిశ, ఫీచర్స్ : కరోనా సెకండ్ వేవ్‌తో ఇండియా మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రతీరోజు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేస్తూ.. కొవిడ్ కట్టడికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో పరిస్థితి ఈ విధంగా ఉంటే, కొన్ని దేశాలు మాత్రం మహమ్మారిపై విజయం సాధించి మాస్క్ ఫ్రీ కంట్రీస్‌గా మారబోతున్నాయి. ఆ దేశాలేవో తెలుసుకుందాం..

భూటాన్ : చైనా, భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్నప్పటికీ.. కేవలం రెండు వారాల్లోనే 90% వయోజనులకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కొవిడ్-19పై యుద్ధంలో విజయం సాధించింది భూటాన్. ఇప్పటి వరకు అక్కడ 1309 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరు మాత్రమే చనిపోయారు. దీంతో లాక్‌డౌన్ అవసరం లేకుండానే కొవిడ్‌ను జయించి మాస్క్ ఫ్రీ దేశంగా మారింది.

ఇజ్రాయెల్ : ఏప్రిల్ రెండోవారంలో ప్రజలు బయటకు రావాలంటే మాస్కులు తప్పనిసరి చేసిన ఇజ్రాయెల్.. సగం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఆ రూల్‌ను రద్దుచేసింది. వ్యాక్సిన్లు దేశానికి, ప్రజలకు మేలు చేస్తాయనేందుకు ఇజ్రాయెల్ మంచి ఉదాహరణ. కాగా మొత్తం మీద 8,39,221 కరోనా కేసులు నమోదైన దేశంలో 6,395 మంది ప్రాణాలు కోల్పోయారు.

న్యూజిలాండ్ : పాండమిక్ సిచ్యువేషన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌దే కీలక పాత్ర. వైరస్ సామూహిక సంక్రమణ, ప్రాణ నష్టాన్ని తప్పించుకుని కేవలం 26 మరణాలతోనే మహమ్మారి నుంచి తప్పించుకుందంటే.. పాండమిక్ సమయంలో ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న సత్వర చర్యలు, నిర్ణయాలే కారణం. అందుకే న్యూజిలాండ్ ఇప్పుడు మాస్క్ ఫ్రీ కంట్రీగా మారింది.

చైనా : కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో దాదాపు ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో మాస్క్ ఫ్రీగా మారబోతోంది. ప్రారంభంలో ప్రపంచ దేశాల్లో కెల్లా చైనాలోనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపగా, ఆ పరిస్థితుల నుంచి కోలుకున్న దేశం టూరిజంకు దారులు తెరిచింది. ఈ మేరకు చైనాలోని థీమ్ పార్క్స్, రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి.

యూఎస్‌ఏ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కారణంగా ఎక్కువ మరణాలతో పాటు అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూసింది అమెరికాలోనే. ఈ నేపథ్యంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఫేస్ మాస్క్ రూల్‌ను సడలించింది. అయితే స్పోర్ట్స్ ఈవెంట్స్, మ్యూజికల్ కాన్సర్ట్స్ వంటి జనసమర్థ ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరి చేసింది.

Tags:    

Similar News