ఏపీ మీదుగా తిరిగే రైళ్లు ఇవే!
దిశ ఏపీ బ్యూరో: రేపటి నుంచి రైళ్లు నడవనున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో 30 రైళ్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. సుమారు 50 రోజుల తరువాత నడువనున్న న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి. నేటి సాయంత్రం నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ మీదుగా నడవనున్న రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ […]
దిశ ఏపీ బ్యూరో: రేపటి నుంచి రైళ్లు నడవనున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో 30 రైళ్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. సుమారు 50 రోజుల తరువాత నడువనున్న న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి.
నేటి సాయంత్రం నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ మీదుగా నడవనున్న రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. అయితే రైలు ప్రయాణం విషయంలో రైల్వే శాఖ కొన్ని నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.
రైలు ప్రయాణం చేయాలనుకునే ఎవరైనా ముందుగా టికెట్ రిజర్వ్ చేయించుకోవాల్సిందే. రెండు గంటల ముందు రైల్వే స్లేషన్‌కి చేరుకోవాలి. ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతనే రైళ్లలోకి అనుమతిస్తారు. ప్రయాణం సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. టికెట్ల కోసం బుకింగ్ కౌంటర్స్ దగ్గరకి రావద్దని తెలిపింది. ఈ లెక్కన పేదలకు రైలు ప్రయాణం నిషేధించినట్టే, జనరల్ బోగీల్లో ఎవరూ ప్రయాణం చేసే అవకాశం లేనట్టే కనిపిస్తోంది.
దేశంలో తిరిగే రైళ్ల వివరాల్లోకి వెళ్తే…
హౌరా – న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ – న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – జమ్మూతావి, బెంగళూరు – న్యూఢిల్లీ, తిరువనంతపురం – న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ – న్యూఢిల్లీ, బిలాస్ పూర్ – న్యూఢిల్లీ, రాంచీ – న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ – న్యూఢిల్లీ, అగర్తలా – న్యూఢిల్లీ, భువనేశ్వర్ – న్యూఢిల్లీ, మడ్ గావ్ – న్యూఢిల్లీ, సికింద్రాబాద్ – న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.