గంగూలీ అసలు అలా అడగలేదు : కోహ్లీ కోచ్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉన్నది. వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు అనవసరం అని భావించడం వల్లే సెలెక్టర్లు కోహ్లీని తప్పించారని స్వయంగా గంగూలీనే వెల్లడించారు. కానీ ఈ వాదన సరిగా లేదని క్రికెట్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఒక పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. ‘టీమ్ ఇండియా […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉన్నది. వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు అనవసరం అని భావించడం వల్లే సెలెక్టర్లు కోహ్లీని తప్పించారని స్వయంగా గంగూలీనే వెల్లడించారు. కానీ ఈ వాదన సరిగా లేదని క్రికెట్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఒక పాడ్‌కాస్ట్‌లో స్పందించారు.
‘టీమ్ ఇండియా వంటి అంతర్జాతీయ జట్టు వన్డే కెప్టెన్సీని కేవలం 48 గంటల నోటీస్ ఇచ్చి తీసేస్తారా? అసలు కోహ్లీని తీసేసి రోహిత్‌ను నియమించే క్రమంలో ఎలాంటి పారదర్శకత పాటించలేదు. అసలు సెలెక్టర్లకు ఏం కావాలో కూడా అర్థం కావడం లేదు. కోహ్లీ కెప్టెన్సీని ఎందుకు తీసేశారో కూడా సెలెక్టర్లు గానీ బీసీసీఐ గానీ చెప్పలేదు. టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దని కోహ్లీని కోరినట్లు గంగూలీ మీడియాకు వెల్లడించారు. అసలు గంగూలీ అలా అడగనే లేదు. గంగూలీ ఎందుకు అలాంటి ప్రకటన చేశాడో అర్దం కావడం లేదు. నేనే కోహ్లీతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ అతడి ఫోన్ ఆఫ్ వస్తున్నది. ఈ విషయంలో సెలెక్టర్లదే తప్పని నాకు అనిపిస్తున్నది’ అని రాజ్ కుమార్ శర్మ అన్నారు. ఇక అదే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ… బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని నేను చెప్పలేను. కానీ కోహ్లీకి సరైన గౌరవం ఇవ్వలేదని మాత్రం చెప్పగలను అన్నాడు.