వెలవెలబోతున్న మలక్‌పేట్ మార్కెట్

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారి (కొవిడ్-19) నిత్యావసర సరుకులపై పంజా విసురుతోంది. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొరత తీవ్రత పెరుగుతోంది. భవిష్యత్తులో దీని ప్రభావం తారస్థాయికి చేరే అవకాశం ఉందంటున్నారు వర్తక వ్యాపారులు. ప్రసుత్తం హోల్‌సేల్, రిటెయిల్ వ్యాపారుల వద్ద ఉన్న సరుకుల నిల్వలు అయిపోతే అసలు తీవ్రత తెలుస్తుందని పలువురు అంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతులు నిలిచిపోవడం, రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయాడానికి ట్రేడర్స్ […]

Update: 2020-04-03 08:46 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారి (కొవిడ్-19) నిత్యావసర సరుకులపై పంజా విసురుతోంది. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొరత తీవ్రత పెరుగుతోంది. భవిష్యత్తులో దీని ప్రభావం తారస్థాయికి చేరే అవకాశం ఉందంటున్నారు వర్తక వ్యాపారులు. ప్రసుత్తం హోల్‌సేల్, రిటెయిల్ వ్యాపారుల వద్ద ఉన్న సరుకుల నిల్వలు అయిపోతే అసలు తీవ్రత తెలుస్తుందని పలువురు అంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతులు నిలిచిపోవడం, రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయాడానికి ట్రేడర్స్ ముందుకు రాకపోవడం, రైతులూ మార్కెట్‌కు ధాన్యం తేకపోవడం.. వెరసి మార్కెట్లన్నీ సరుకులు లేకా బోసిపోతున్నాయి. దీని ప్రభావం ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టనుందని వర్తక వ్యాపారుల వాపోతునున్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అతిపెద్ద మార్కెట్ మలక్‌పేట్ ఇక్కడి నుంచి హైదరాబాద్ మహానగరంతో పాటు వివిధ జిల్లాలకు సరుకులు సరఫరా అవుతాయి.ఇలాంటి మార్కెట్‌లో సరుకులు లేమితో వెలవెలబోతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉల్లిగడ్డ తప్ప మరొకటి కనిపించడం లేదు. మిర్చి దిగుమతి నిలిచిపోయి 15 రోజులు అవుతుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మరో 15 రోజుల వరకు కూడా వచ్చుడు కష్టం అని చెబుతున్నారు. ఇక చింతపండు 100 క్వింటాలు మాత్రమే ఉంది. మహారాష్ట్ర నుంచి ఎలాంటి వాహనాలు రానివ్వొద్దని చెప్పడంతో మహారాష్ట్ర నుంచి వచ్చే సరుకులు మొత్తం నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు మిర్చి, చింతపండు మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలకు శనివారం నుంచి పర్మిషన్ లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఆంక్షలు ఈ నెల 15వరకు వర్తించనున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో చింతపండు.. మిర్చిరేటు నేటి నుంచి అమాంతం పేరిగే అవకాశం లేక పోలేదంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీని ప్రభావం 2, 3 నెలలు ఉంటుందని వర్తక వ్యాపారులు చెబుతున్నారు.

Tags: corona virus, covid 19 effect, on stock of goods, malakpet market

Tags:    

Similar News