ఆర్డర్లు లేకుండా కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు

దిశ,సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కాంట్రాక్టు అధ్యాపకులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు లేకుండా బదిలీలకు తెరలేపారు. యూనివర్సిటీ చరిత్రలో కాంట్రాక్టు అధ్యాపకులను బదిలీ చేయడం ఇది మొదటిసారి. కాగా, మౌఖిక ఉత్తర్వులు జారీ చేసి వారిని బదిలీ చేయడం వివాదంగా మారింది. దీనిపై పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బదిలీలపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్, వర్సిటీ అధికారులు కూడా స్పష్టత ఇవ్వటం లేదు. తమను బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళతామని, అయితే లిఖిత […]

Update: 2021-09-01 10:09 GMT

దిశ,సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కాంట్రాక్టు అధ్యాపకులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు లేకుండా బదిలీలకు తెరలేపారు. యూనివర్సిటీ చరిత్రలో కాంట్రాక్టు అధ్యాపకులను బదిలీ చేయడం ఇది మొదటిసారి. కాగా, మౌఖిక ఉత్తర్వులు జారీ చేసి వారిని బదిలీ చేయడం వివాదంగా మారింది.

దీనిపై పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బదిలీలపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్, వర్సిటీ అధికారులు కూడా స్పష్టత ఇవ్వటం లేదు. తమను బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళతామని, అయితే లిఖిత పూర్వక ఉత్తర్వులు ఎందుకు ఇవ్వరో స్పష్టం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు.

ఓయూలో 258 మంది కాంట్రాక్టు అధ్యాపకులు

ఉస్మానియా యూనివర్సిటీలో 56 విభాగాలలో సుమారు 700 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తుండగా, అందులో బడ్జెట్ పోస్టులలో 258 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరంతా నిజామ్ కళాశాల, కోఠి మహిళా కళాశాల, పీజీ కాలేజీ సికింద్రాబాద్, పీజీ కాలేజీ సైఫాబాద్, ఓయూ ఆర్ట్స్ కళాశాలలో వివిధ విభాగాలలో టీచింగ్ చేస్తున్నారు. వీరిలో యూనివర్సిటీ అధికారులు 150 మంది కాంట్రాక్టు అధ్యాపకులను ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి బదిలీ చేసింది.

యూనివర్సిటీ వందేళ్ల చరిత్ర ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తొలిసారిగా కాంట్రాక్టు అధ్యాపకులను ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి బదిలీ చేయాలని ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. వీసీ ఆదేశాలు అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్స్ వెంటనే తమ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మౌకిక ఆదేశాలు జారీ చేశారు. నిజామ్ కళాశాలలో 50 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తుండగా వారిలో 36 మందిని వివిధ కళాశాలలకు బదిలీ చేశారు. అలాగే పీజీ కళాశాల సైఫాబాద్‌లో 40 మందిని, కోఠి మహిళా కళాశాలలో 35 మందిని, ఓయూ ఆర్ట్స్ కళాశాలలో 25 మందిని ఇలా అన్నీ కళాశాలలో వారికి బదిలీల పేరుతో స్థాన చలనం కల్పించారు.

కాంట్రాక్టు అధ్యాపకులకు బదిలీలు వర్తించవు.

యూనివర్సిటీలలో పనిచేసే పర్మినెంట్ అధ్యాపకులకు మాత్రమే బదిలీలు వర్తిస్తాయి తప్ప బడ్జెట్ పోస్టులలో నిమితులైన కాంట్రాక్టు అధ్యాపకులకు బదిలీలు వర్తించవు. ఒక కాలేజీలోని డిపార్టుమెంట్లో ఖాళీ అయిన బడ్జెట్ పోస్టుకు కళాశాల నోటిఫికేషన్ వేసి ఎంపిక చేస్తారు. ఎంపికైనా అధ్యాపకుడు అదే కళాల పరిధిలోనే పనిచేయాలని మాత్రమే సంబంధిత ప్రిన్సిపాల్ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.

యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వీరికి బదిలీలు ఉండవు. ఒక వేళ బదిలీ ప్రక్రియ చేపడితే వారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చి బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం వారికి మౌఖిక ఉత్తర్వులతోనే ట్రాన్స్ఫర్ చేశారు. దీనిని కాంట్రాక్టు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News