‘ఆచార్య’లో రెజీన..లేనట్లేనా?

దిశ, వెబ్ డెస్క్: రెజీనా కసాండ్రా..SMS(శివ మనసులో శృతి) మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ సినిమాతో సైమా ఫీమేల్ డెబ్యూ అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘రారా క్రిష్ణయ్య’, ‘కొత్త జంట’, ‘నక్షత్రం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. గ్లామరస్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామకి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. దాంతో నటనా ప్రాధాన్యమున్న […]

Update: 2020-11-16 11:01 GMT

దిశ, వెబ్ డెస్క్: రెజీనా కసాండ్రా..SMS(శివ మనసులో శృతి) మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ సినిమాతో సైమా ఫీమేల్ డెబ్యూ అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘రారా క్రిష్ణయ్య’, ‘కొత్త జంట’, ‘నక్షత్రం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది.

గ్లామరస్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామకి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. దాంతో నటనా ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేసేందుకు ప్రయత్నించింది. గ్లామర్ డోస్ కూడా పెంచింది. ‘గువ్వా గోరింతో’ అనే మెగాస్టార్ పాటను తేజ్‌తో కలిసి చేసిన ఈ భామ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, బోల్డ్ క్యారెక్టర్లు వేయడం ప్రారంభించింది. ‘ఎవరు’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో రెజీనా మళ్లీ రైజింగ్‌లోకి వస్తుందని అందరూ భావించారు. కానీ, అమ్మడికి చెప్పుకోదగ్గ ఆఫర్స్ మాత్రం రాలేదు.

డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’లో ఐటెం సాంగ్‌లో రెజీనా కనిపించనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఇంతవరకు దీని గురించి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు ‘ఆచార్య’(Acharya) షూటింగ్ షురూ అయింది. చిరంజీవికి కరోనా పాజిటివ్ ‘ఫాల్టీ’ కిట్ వల్లే వచ్చిందని, తనకు అసలు కొవిడ్ రాలేదని ఇటీవల మెగాస్టార్ చిరంజీవే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన లేకుండానే ఇతర షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్న డైరెక్టర్..ఈ నెల 20 నుంచి మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ తేజ్, కాజల్‌తో షూటింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక షూటింగే పూర్తవుతున్న ఈ సందర్భంలో ‘ఆచార్య’లో రెజీన..ఉంటుందా?..ఐటెం సాంగ్ ఉంటుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News