‘సీఏఏతో ముస్లింలకు నష్టమేమీ లేదు’

గువహతి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో ముస్లింలకు నష్టమేమీ లేదని, పొరుగుదేశాల్లో పీడనకు గురైన మైనార్టీలకు దన్నుగా నిలిచేలా సవరించినట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం చెప్పారు. హిందూ, ముస్లిం విభజన, మతపరమైన వాదనలతో సీఏఏకు సంబంధం లేదని, ఆ వాదనలన్నీ కొందరు రాజకీయ మైలేజీ కోసం ప్రచారం చేస్తున్నవేనని కొట్టిపారేశారు. ‘మైనార్టీలను సంరక్షిస్తామని స్వాతంత్ర్యానంతరం దేశ తొలిప్రధాని హామీనిచ్చారు. దాన్ని అలాగే పాటిస్తున్నాం. పాటిస్తాం కూడా. ఒక్క ముస్లిం కూడా సీఏఏతో నష్టపోడు’ అని వివరించారు. […]

Update: 2021-07-21 07:00 GMT

గువహతి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో ముస్లింలకు నష్టమేమీ లేదని, పొరుగుదేశాల్లో పీడనకు గురైన మైనార్టీలకు దన్నుగా నిలిచేలా సవరించినట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం చెప్పారు. హిందూ, ముస్లిం విభజన, మతపరమైన వాదనలతో సీఏఏకు సంబంధం లేదని, ఆ వాదనలన్నీ కొందరు రాజకీయ మైలేజీ కోసం ప్రచారం చేస్తున్నవేనని కొట్టిపారేశారు. ‘మైనార్టీలను సంరక్షిస్తామని స్వాతంత్ర్యానంతరం దేశ తొలిప్రధాని హామీనిచ్చారు. దాన్ని అలాగే పాటిస్తున్నాం. పాటిస్తాం కూడా. ఒక్క ముస్లిం కూడా సీఏఏతో నష్టపోడు’ అని వివరించారు.

రెండు రోజుల అసోం పర్యటనలో ఉన్న ఆయన సిటిజన్‌షిప్ డిబేట్ ఓవర్ ఎన్‌ఆర్‌సీ, సీఏఏ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొరుగుదేశాల్లోని మైనార్టీలకు రక్షణగానే ఈ సీఏఏను తెచ్చారని వివరించారు. ఓ సంక్షోభకాలంలో ఆ దేశాల్లోని మెజార్టీ వర్గాలనూ కలిశామని, బెదిరింపులు, భయాలతో మనదేశానికి వస్తే వారికీ సహాయపడటానికి సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఎన్ఆర్‌‌సీ గురించి మాట్లాడుతూ ఏ దేశమైనా తమ పౌరులు ఎవరని చూసే హక్కు కలిగి ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News