సీఎం దత్తత గ్రామాల్లో అభివృద్ది ఉత్తదే : అజహారుద్దీన్

దిశ ప్రతినిధి, మేడ్చల్ : సీఎం దత్తత గ్రామాల్లో అభివృద్ది ఉత్తమాటేనని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. దత్తత తీసుకొని ఏళ్లు గడుస్తున్నా గ్రామాలను అభివృద్ది చేయని ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ఈ నెల 24, 25తేదీన చేపట్టనున్న 48 గంటల దళిత గిరిజన దండోరా దీక్ష కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్సీ రాములు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ […]

Update: 2021-08-23 12:16 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : సీఎం దత్తత గ్రామాల్లో అభివృద్ది ఉత్తమాటేనని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. దత్తత తీసుకొని ఏళ్లు గడుస్తున్నా గ్రామాలను అభివృద్ది చేయని ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ఈ నెల 24, 25తేదీన చేపట్టనున్న 48 గంటల దళిత గిరిజన దండోరా దీక్ష కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్సీ రాములు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి,అద్దంకి దయాకర్ లతో కలిసి ఆయన పరిశీలించారు.

కార్యక్రమ వేదిక, వాహనాల పార్కింగ్, కార్యకర్తలు కూర్చోడానికి చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ .. సీఎం దత్తత తీసుకున్న గ్రామాల్లో అశీంచిన అభివృద్ది జరగలేదని, ప్రభుత్వ పథకాలు పేదలకు అందిన దాఖలాలు కూడా కనిపించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు నిరాశతో ఉన్నాయన్నారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రాష్ర వ్యాప్తంగా ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విసిగి వేసారి ఉన్నారని వారు పేర్కొన్నారు.

ఉప ఎన్నికల కోసమే పథకాలు..

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సీఎం హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను హామీలతో మభ్యపెట్టి ఓట్లను దండుకుంటున్నారని ఆరోపించారు. దళితులపై ప్రేమ కురిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వారికి చేసింది ఏమిటని నిలదీశారు. రాష్ట్రమంతా దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా ఖర్చుచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. పేదలకు ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. సోనియాగాంధీ నేతృత్వంలో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్, మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సరిత, జడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News