ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ సిద్ధంగా ఉండనున్నట్టు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ చెప్పారు. గ్లోబల్ హెల్త్ బాడీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ముగింపు సమావేశంలో ఆయన పైవిధంగా ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ మొత్తానికి వ్యాక్సిన్ అత్యవసరమని, ప్రస్తుత ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందనే […]

Update: 2020-10-07 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ సిద్ధంగా ఉండనున్నట్టు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ చెప్పారు. గ్లోబల్ హెల్త్ బాడీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ముగింపు సమావేశంలో ఆయన పైవిధంగా ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ మొత్తానికి వ్యాక్సిన్ అత్యవసరమని, ప్రస్తుత ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందనే ఆశలున్నాయని ఆయన చెప్పారు.

అయితే, కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటిని అంతర్జాతీయంగా సమానస్థాయిలో పంపిణీ చేయాలని తెలిపారు. ఈ పంపిణీ అంశంలో ప్రపంచ నాయకుల మధ్య సమన్వయం ఉండాలని, రాజకీయ నిబద్దత అవసరమని టెడ్రోస్ అథనామ్ వెల్లడించారు. కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రపంచ దేశాలు వనరులను, శక్తిని వినియోగించాలన్నారు. అలాగే, డబ్ల్యూహెచ్‌వో నేతృత్వంలో కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ సహా మొత్తం తొమ్మిది వ్యాక్సిన్లు చివరిదశ ప్రయోగ దశలో ఉన్నాయని ఆయన వివరించారు. ఆ వ్యాక్సిన్‌లన్నీ దాదాపుగా విజయవంతమయ్యే అవకాశమున్నట్టు టెడ్రోస్ తెలిపారు.

Tags:    

Similar News