కూరగాయల వ్యాపారులకూ కరోనా దెబ్బ..

దిశ, న్యూస్‌ బ్యూరో: లాక్‌డౌన్ ప్రారంభంలో రెండు, మూడు రోజులు కూరగాయల ధరలు పిరమై..సామాన్య ప్రజలకు చుక్కలు చూపాయి. కాని ఆ తర్వాత కాలంలో కూరగాయలు కొనేందుకు వచ్చే వాళ్లు రోజురోజుకూ తగ్గిపోయారు. దాంతో కూరగాయలు అసలు అమ్ముడుపోవడం లేదంటూ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. వడ్డీలకు అప్పుతెచ్చి కూరగాయలు తెస్తే కొనేవారు లేక సరుకు పాడైపోయి తమ జీవనం దుర్భరంగా మారిందనీ తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అప్పు తెచ్చి సరుకు కొనుగోలు.. కరోనా (కోవిడ్-19) మహమ్మారి […]

Update: 2020-03-29 07:40 GMT

దిశ, న్యూస్‌ బ్యూరో: లాక్‌డౌన్ ప్రారంభంలో రెండు, మూడు రోజులు కూరగాయల ధరలు పిరమై..సామాన్య ప్రజలకు చుక్కలు చూపాయి. కాని ఆ తర్వాత కాలంలో కూరగాయలు కొనేందుకు వచ్చే వాళ్లు రోజురోజుకూ తగ్గిపోయారు. దాంతో కూరగాయలు అసలు అమ్ముడుపోవడం లేదంటూ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. వడ్డీలకు అప్పుతెచ్చి కూరగాయలు తెస్తే కొనేవారు లేక సరుకు పాడైపోయి తమ జీవనం దుర్భరంగా మారిందనీ తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

అప్పు తెచ్చి సరుకు కొనుగోలు..

కరోనా (కోవిడ్-19) మహమ్మారి కూరగాయల వ్యాపారులనూ దెబ్బతీస్తోంది. అప్పు తెచ్చి సరుకులు కొనుగోలు చేసి మార్కెట్‌కు తీసుకొస్తే కొనేందుకు జనాలు ముందుకు రావడం లేదు. ఇందుకు కరోనా మహమ్మారి భయమే ఉందని వ్యాపారులు అంటున్నారు. ఎందుకంటే సామాజిక దూరం పాటించాలని జనాలు అసలు మార్కెట్‌కు రావడానికే జంకుతున్నారనీ, వారికి ప్రభుత్వం అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అయితే, సరుకు ఇలాగే పాడైపోతే..తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనీ, కుటుంబాలను ఎలా సాకాలో తెలియడం లేదంటూ భయపడుతున్నారు.

ఆగమ్యగోచరంగా చిరు వ్యాపారుల జీవనం..

కోవిడ్ -19 దెబ్బకు చిరువ్యాపారుల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. హైదరాబాద్ శివారు గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి పట్నంలో కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించే వారు. లాక్‌డౌన్‌తో వీరికి సిటీలో అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కింద మీద పడి ఏదో రకంగా మార్కెట్‌కు కూరగాయలు తెచ్చినప్పటికీ మార్కెట్లో కొనేవారు లేకా రూపాయికు అమ్మాల్సిన సరుకు పావులకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. నాలుగైదు రోజుల నుంచి కూలి కూడా గిట్టడం లేదంటున్నారు రైతులు. ఇక సిటీలో కూరగాయల వ్యాపారాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వారి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కర్ఫ్యూ ముందు రోజు కూరగాయలు రేట్లు ఉన్నదానిక కంటే నాలుగింతలు పెంచి విక్రయించిన విషయం తెలిసిందే. కాని క్రమేణా కూరగాయలు రేట్లు సాధారణ స్థితికి చేరాయి. కాని వినియోగదారుల సంఖ్య తగ్గిపోయింది. ఈ తగ్గుదలకు కరోనా ఫోబియా కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుతుండటంతో జనాలు సామాజిక దూరం పాటించాలని భావిస్తున్నారు. ఇంటి నుంచి బయటకొచ్చేందుకూ జంకుతున్నారు. ఇక కూరగాయలు కొనేందుకు ఎలా వస్తారు. ఇలానే కొనసాగితే తమ కుటుంబ జీవనం ఎలా సాగించాలని కూరగాయల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Tags: Lockdown, Consumer, Interest, Vegetable, coronavirus

Tags:    

Similar News