హైదరాబాద్‌లో వింత.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మరింత ఆదాయాన్ని పొందేందుకు వైన్స్ షాపులను పెంచిన విషయం తెలిసిందే. ఈక్రమంలో దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి దేనిపై ఎక్కువ ప్రాధాన్యత ఉందో తెలుస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో జనసాంద్రత ఆధారంగా చూస్తే ఆసుపత్రుల కంటే వైన్స్ షాపులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 22,323 మంది జనాభాకి ఒక్క వైన్ షాపు ఉండగా.. 34,691 మందికి ఒక కరోనా ట్రీట్మెంట్ ఆసుపత్రి ఉంది. ఇక […]
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మరింత ఆదాయాన్ని పొందేందుకు వైన్స్ షాపులను పెంచిన విషయం తెలిసిందే. ఈక్రమంలో దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి దేనిపై ఎక్కువ ప్రాధాన్యత ఉందో తెలుస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో జనసాంద్రత ఆధారంగా చూస్తే ఆసుపత్రుల కంటే వైన్స్ షాపులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 22,323 మంది జనాభాకి ఒక్క వైన్ షాపు ఉండగా.. 34,691 మందికి ఒక కరోనా ట్రీట్మెంట్ ఆసుపత్రి ఉంది. ఇక 77,792 మంది ప్రజలకు ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంది.
దీనికి సంబంధించి ‘హక్కు ఛానల్’ స్వయంగా హైదరాబాద్ జనసాంద్రతతో పాటు నగరంలో ఉన్న వైన్సులు, పోలీస్ స్టేషన్లను పోల్చి ఈ లెక్కలను ప్రకటించింది. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి నగరంలోని మహిళల భద్రత, నగరవాసుల ఆరోగ్యం కంటే వైన్స్ షాపులే ఎక్కువా అంటూ ప్రశ్నించింది.
More Wine Shops than Covid Hospitals in #Hyderabad. Here are the facts:
▪️1 hospital per 34,000+ people for Covid
▪️1 wine shop per 22,000+ people
(Govt data/Media reports)Full Series: https://t.co/xAc3BwjEfi@HakkuInitiative #HakkuCampaign#WomenSafetyWineShops #AskTheWomen pic.twitter.com/bCSTqNQxuT
— Kota Neelima కోట నీలిమ (@KotaNeelima) November 15, 2021