శారద దుకాణంలో చోరీ

దిశ, వెబ్ డెస్క్: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శారద దుకాణంలో చోరీ జరిగింది. దీంతో ఆ యువతి ఆవేదన గురైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ లోని శ్రీనగర్ కాలనీలో ఫుట్ పాత్ పై శారద కూరగాయలు విక్రయిస్తది. అయితే, రోజువారీగా అమ్ముడుపోగా మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై పెట్టి కవర్ తో కప్పి వెళ్లిపోయింది. ఉదయం వచ్చి చూసే సరికి ఆ కూరగాయలు మాయమయ్యాయని, ఖాళీ బండి మాత్రమే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు […]

Update: 2020-07-30 23:25 GMT

దిశ, వెబ్ డెస్క్: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శారద దుకాణంలో చోరీ జరిగింది. దీంతో ఆ యువతి ఆవేదన గురైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ లోని శ్రీనగర్ కాలనీలో ఫుట్ పాత్ పై శారద కూరగాయలు విక్రయిస్తది. అయితే, రోజువారీగా అమ్ముడుపోగా మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై పెట్టి కవర్ తో కప్పి వెళ్లిపోయింది. ఉదయం వచ్చి చూసే సరికి ఆ కూరగాయలు మాయమయ్యాయని, ఖాళీ బండి మాత్రమే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు ఆ కూరగాయలు రూ. 5 వేలు విలువ చేస్తాయని శారద చెప్పినట్లు తెలిసింది. ఏరోజు కూడా కూరగాయలు పోలేదంటూ బాధతో చెప్పింది.

కాగా, కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శారద మనో ధైర్యం కోల్పోకుండా ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతూ ఇతరులకు ఆదర్శించిన విషయం తెలిసిందే. ఆమెకు సోనుసూద్ సాయం చేసిన మాట కూడా విధితమే.

Tags:    

Similar News