తూర్పుగోదావరి జిల్లా అప్పన్నపల్లి దేవాలయంలో వింత దొంగతనం
దిశ,వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో వింత దొంగతనం జరిగింది. అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయంలో పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి అన్నచందంగా గుడిలో బంగారం, డబ్బులు కాకుండా భక్తులు సమర్పించే తలనీలాలపై దొంగ కన్నుపడింది. దొంగతనం జరిగిన అనంతరం దొంగ ముఖానికి మాస్క్ పెట్టుకొని జారుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ పుటేజీల్లో రికార్డైంది. అయితే దొంగతనం పై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. తలనీలాలే కదా అని లైట్ తీసుకోవద్దని ఆలయ […]
దిశ,వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో వింత దొంగతనం జరిగింది. అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయంలో పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి అన్నచందంగా గుడిలో బంగారం, డబ్బులు కాకుండా భక్తులు సమర్పించే తలనీలాలపై దొంగ కన్నుపడింది. దొంగతనం జరిగిన అనంతరం దొంగ ముఖానికి మాస్క్ పెట్టుకొని జారుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ పుటేజీల్లో రికార్డైంది. అయితే దొంగతనం పై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
తలనీలాలే కదా అని లైట్ తీసుకోవద్దని ఆలయ అధికారులు చెబుతున్నారు. తిరుమలలో టన్నుల కొద్ది భక్తులు సమర్పించే తలనీలాల వల్ల టీటీడీకి భారీ ఆదాయం వస్తుందని, అదే తరహాలో ఈ ఆలయంలో భక్తులు సమర్పించే తలనీనాల్ని బట్టి ఆదాయం వస్తుందని అంటున్నారు.
ఇక సీసీటీపీ పుటేజీ ఆధారంగా కోనసీమ ప్రజలు తిరుపతి తరువాత తిరుపతిగా కొలిచే శ్రీ బాల బాలాజీ ఆలయంలో దొంగతనం గత అర్ధరాత్ర 3గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్వేది ఘటన తరువాత రాష్ట్రంలోని పలు ఆలయాల్లో హుండీలు పగలగొట్టినా, విగ్రహాల్ని ధ్వంసం చేసినా హాట్ టాపిగ్గా మారింది. అదే తరహాలో అప్పన్నపల్లి ఆలయంలో జరిగిన తలనీలాల దొంగతనం హాట్ టాపిగ్గా మారింది. దొంగతనం చేసిన తలనీలాల ఖరీదు లక్షా యాబైవేలకు పైగా ఉంటుందని ఆలయ ఈఓ తెలిపారు.
ఈ ఆలయానికి భక్తులు సమర్పించే తలనీలాలను ప్రతీ ఏడు ఆలయం అధికారులు వేలం పాట నిర్వహిస్తారు. ఈ సారి వేలం పాటలో ఏలూరుకు చెందిన శ్రీనివాస అనే కంపెనీ యాజమాన్యం రూ.30లక్షల 6వేలు చెల్లించి దక్కించుకుంది. వేలంలో భాగంగా ప్రతీ నెలల భక్తులు సమర్పించిన నీలాల్ని సంబంధింత ఇండస్ట్రీకి తరలిస్తుంటారు. ఇందులో భాగంగా అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ పాత ఆలయం గర్భగుడి పై భాగంలో ఓ రూమ్ లో భద్రపరుస్తుంటారు. అలా భద్రపరిచిన రూమ్ తాళాల్ని పగలగొట్టి దొంగ తలనీలాల్ని దొంగతనం చేయడం చర్చాంశనీయంగా మారింది.
కాగా గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్న వరుస విగ్రహాల ధ్వంసంపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.