పరీక్షలో క్వాలిఫై కానేమో అని.. యువతి ఆత్మహత్య
దిశ, ముషీరాబాద్: చార్టెడ్ అకౌంట్ చదువుతున్న ఓ యువతి మానసిక ఒత్తిడికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో ఆదివారం జరిగింది. వివరాళ్లోకి వెళితే… రాంనగర్‌లో నివాసం ఉండే ఉత్తమ్ చంద్ జైన్ ఇందిరా పార్కు వద్ద ఆయుర్వేదిక్ షాపులో పని చేస్తున్నాడు. ఆయన కూతురు స్వప్న జైన్ మూడేండ్లుగా సీఏ చదువుతోంది. గతంలో మూడు సార్లు చార్టెడ్ అకౌంట్ పరీక్షలు రాసినా ఆమె క్వాలిఫై కాలేదు. […]
దిశ, ముషీరాబాద్: చార్టెడ్ అకౌంట్ చదువుతున్న ఓ యువతి మానసిక ఒత్తిడికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో ఆదివారం జరిగింది. వివరాళ్లోకి వెళితే… రాంనగర్‌లో నివాసం ఉండే ఉత్తమ్ చంద్ జైన్ ఇందిరా పార్కు వద్ద ఆయుర్వేదిక్ షాపులో పని చేస్తున్నాడు. ఆయన కూతురు స్వప్న జైన్ మూడేండ్లుగా సీఏ చదువుతోంది. గతంలో మూడు సార్లు చార్టెడ్ అకౌంట్ పరీక్షలు రాసినా ఆమె క్వాలిఫై కాలేదు.
నాలుగోసారి చార్టెడ్ అకౌంట్ పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాకపోవడంతో, మళ్లీ క్వాలిఫై కానేమో అనే భయంతో మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చదువుకుంటున్న కూతురు ఇంకా కిందికి దిగిరాక పోవడంతో తండ్రి పైకి వెళ్లి చూశాడు. తలుపు బోల్ట్ పెట్టి ఉండడంతో తెరిచి చూడగా స్వప్న జైన్ ఉరి వేసుకుని కనిపించింది. ఆమె తండ్రి ఉత్తమ్ చంద్ జైన్ అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.