ఫ్లాష్..ఫ్లాష్.. బిర్యాని తిని రక్తం కక్కుకొని యువకుడు మృతి.. అసలేం జరిగింది..?
దిశ, నర్సంపేట : నియోజకవర్గంలోని నర్సంపేట పట్టణంలో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో బిర్యాని తిన్న యువకుడు కొన్ని నిముషాల వ్యవధిలోనే రక్తం కక్కుకు చనిపోయిన సంఘటన పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో గల రాయల్ ఫుడ్ కోర్ట్ వద్ద జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం… చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బోడ తండాకి చెందిన బోడ ప్రసాద్ (24) ఆదివారం మధ్యాహ్నం నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ కి చేరుకున్నాడు. […]
దిశ, నర్సంపేట : నియోజకవర్గంలోని నర్సంపేట పట్టణంలో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో బిర్యాని తిన్న యువకుడు కొన్ని నిముషాల వ్యవధిలోనే రక్తం కక్కుకు చనిపోయిన సంఘటన పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో గల రాయల్ ఫుడ్ కోర్ట్ వద్ద జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం… చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బోడ తండాకి చెందిన బోడ ప్రసాద్ (24) ఆదివారం మధ్యాహ్నం నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ కి చేరుకున్నాడు. భోజన సమయం కావడంతో పక్కనే ఉన్న రాయల్ ఫుడ్ కోర్టులో బిర్యానీ తినడానికి వెళ్లాడు.
ఉన్నట్టుండి కొన్ని నిముషాల వ్యవధిలో బయటికి వచ్చి రక్తం కక్కుకొని కిందపడిపోయాడు. స్థానికులు గుర్తించేసరికి అతను మృతి చెందినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించే సమయం కూడా లేకుండా మృత్యువాత పడటం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రసాద్ మరణానికి ఫుడ్ పాయిజన్ కారణమా.. లేక ఏదన్నా బలమైన కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా… పోస్ట్ మార్టం తర్వాతే బోడ ప్రసాద్ మృతికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.