భలే.. భలే.. బ్యాటరీ సైకిల్.. ఖర్చు ఎంతో తెలుసా..
దిశ, సిద్దిపేట : పెట్రో మంటతో సాధారణ ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నది.. పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయలు దాటడంతో బైక్ బయట తీయాలంటేనే గుబులు పుడుతున్నది… దీంతో ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఔత్సాహికులు వినూత్న ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు.. పాత సైకిల్‌ను బ్యాటరీ ఎలక్ట్రిక్ బైక్ లా మార్చాడు ఓ యువకుడు.. మూడు గంటలు ఛార్జ్ చేస్తే 40 కి.మీ. దూరం ప్రయాణించేలా రూపొందించాడు.. న్యూ ఎలక్రిక్ బైస్కిల్ పై […]
By - AnukaranUpdate: 2021-08-21 06:22 GMT
దిశ, సిద్దిపేట : పెట్రో మంటతో సాధారణ ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నది.. పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయలు దాటడంతో బైక్ బయట తీయాలంటేనే గుబులు పుడుతున్నది… దీంతో ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఔత్సాహికులు వినూత్న ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు.. పాత సైకిల్‌ను బ్యాటరీ ఎలక్ట్రిక్ బైక్ లా మార్చాడు ఓ యువకుడు.. మూడు గంటలు ఛార్జ్ చేస్తే 40 కి.మీ. దూరం ప్రయాణించేలా రూపొందించాడు.. న్యూ ఎలక్రిక్ బైస్కిల్ పై ప్రత్యేక కథనం..
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ఇలా అయితే బైక్ నడుపడం భారంగా మారుతుందని ఆలోచించి, ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేయాలని అనుకున్నాడు పట్టణానికి చెందిన మోసిన్ అనే యువకుడు. పాత సామాను దుకాణాలకు వెళ్లి, మోటార్‌తో కూడిన సైకిల్ రీమ్, ఒక సెన్సార్ తో కూడిన హ్యాండిల్ కొనుగోలు చేశాడు. వీటన్నిటినీ ఒక పాత సైకిల్ కు అమర్చి, తన షాప్ లో ఉన్న రెండు 32 యంప్స్ బ్యాటరీలను సైకిల్ పైడీల్ మధ్యన అమర్చాడు. సెన్సార్ బోర్డ్ , మోటార్ లను బ్యాటరీ తో అనుసంధానం చేశాడు.
అంతే ఎలక్ట్రానిక్ సైకిల్ తయారయింది. సిద్దిపేట పట్టణానికి చెందిన మోసిన్ అనే యువకుడు వినూత్నంగా ఆలోచించి బ్యాటరీ సహాయంతో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్ పై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. బ్యాటరీని మూడు గంటలపాటు ఛార్జ్ చేస్తే, 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఈ సైకిల్ ప్రత్యేకత రివర్స్ కూడా వెళ్తుంది. ఈ సైకిల్ కి రెండు కీస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా బటన్ వేయగానే సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రానిక్ సైకిల్ తో ఎటువంటి కాలుష్యం ఏర్పడదు. ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేయడానికి 8000 రూపాయలు ఖర్చయిందని మోసిన్ తెలిపారు.