కోటీ 20 లక్షల మందికి 4 వెంటిలేటర్లే!
దిశ వెబ్‌డెస్క్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని కమ్మేసింది. ఇప్పటికే 2.2 మిలియన్ కేసులతో ప్రపంచమంతా అల్లాడిపోతోంది. ఇప్పటివరకు కరోనా కోరల్లో 1,55,000 మంది బలయ్యారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తూ పోతుంటే.. కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎప్పటికప్పుడు ‘లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ’ను పెంచుకుంటూ పోతున్నాయి. కరోనా బాధితులకు అవసరమైన వెంటిలేటర్లు, మాస్క్‌లు, మందులు, ఇతర వైద్య పరికరాల కోసం ఆయా దేశాలు సత్వర చర్యలు చేపడుతున్నాయి. హెల్త్ […]
దిశ వెబ్‌డెస్క్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని కమ్మేసింది. ఇప్పటికే 2.2 మిలియన్ కేసులతో ప్రపంచమంతా అల్లాడిపోతోంది. ఇప్పటివరకు కరోనా కోరల్లో 1,55,000 మంది బలయ్యారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తూ పోతుంటే.. కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎప్పటికప్పుడు ‘లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ’ను పెంచుకుంటూ పోతున్నాయి. కరోనా బాధితులకు అవసరమైన వెంటిలేటర్లు, మాస్క్‌లు, మందులు, ఇతర వైద్య పరికరాల కోసం ఆయా దేశాలు సత్వర చర్యలు చేపడుతున్నాయి. హెల్త్ కేర్ ఎక్విప్‌మెంట్ విషయంలో దేశాలన్నీ కూడా పరస్పరం సాయం చేసుకుంటూ ఉన్నాయి. హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ లేకపోతే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఇప్పటికే కొన్ని దేశాలను చూస్తే తెలుస్తోంది. అయినా.. కొన్ని దేశాల్లో వెంటిలేటర్లు, ఐసీయూలు, మందులు కూడా లేకపోవడం గమనార్హం.
సూడాన్ అవస్థలు సూడాలె…
ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐఆర్సీ) లెక్కల ప్రకారం… సూడాన్ లో ముప్పై లక్షల మందికి ఒక్క వెంటిలేటర్ అందుబాటులో ఉంది.
కరోనా గుప్పిట్లో ప్రపంచమున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా బాధితుల్లో కొందరికీ తప్పనిసరిగా క్రిటికల్ కేర్ అవసరమవుతుంది. అందుకోసం వెంటిలేటర్ పెట్టడం తప్పనిసరి. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో వెంటిలేటర్లు లేవు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దక్షిణ సూడాన్. ఆ దేశ జనాభా కోటీ 20 లక్షల మంది. అంత జనాభాకు అక్కడ నాలుగు వెంటిలేటర్లు, 24 ఐసీయూ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐఆర్సీ) లెక్కల ప్రకారం.. మూడు మిలియన్ల ప్రజలకు ఒక్క వెంటిలేటర్ ఉంది. అలాగే బుర్కినా ఫాసో లో 11 వెంటిలేటర్లు, సియర్ర లియోన్లో 13, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో 3 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. వెనిజులా పాపులేషన్ 32 మిలియన్స్ కాగా.. అక్కడ కేవలం 84 ఐసీయూ బెడ్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు 90 శాతానికి పైగా ఆసుపత్రుల్లో .. మెడిసిన్స్, క్రిటికల్ సప్లయ్స్ లేక ఇబ్బంది పడుతున్నాయని ఐఆర్సీ పేర్కొంది. ఇక 41 ఆఫ్రికా దేశాలకు 2,000 వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రపంచంలోని 43 దేశాల్లో 5 వేల కంటే తక్కువ ఐసీయూ బెడ్స్ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. అంటే పది లక్షల మందికి ఒక బెడ్ అందుబాటులో ఉన్నట్లు లెక్క. అదే యూరప్‌లో అయితే ప్రతి నాలుగు వేల మందికి ఒక బెడ్ ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది.
డబ్య్లూహెచ్‌వో మాటల్లో..
కరోనా బాధితుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా క్రిటికల్ పేషేంట్స్ కు వెంటిలేటర్ పెట్టడం తప్పనిసరి. ఒక్క యూఎస్ఏ లోనే.. 5 లక్షల అదనపు వెంటిలేటర్ల అవసరముందని జాన్స్ హప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ చెబుతోంది. యూకేలో ఇప్పటివరకు 110,000 కేసులుండగా, 18 వేల అదనపు వెంటిలేటర్ల అవసరమున్నట్లు గుర్తించారు. కరోనా వల్ల అత్యంత నష్టపోయిన దేశాల్లో ఇటలీ ఒకటి. ఆ ప్రభుత్వం ఇప్పటివరకు 2,700 వెంటిలేటర్లను వివిధ ఆస్పత్రులకు అందజేసింది. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం 10 వేల ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నా, మరో 10 వేల బెడ్స్ ను సిద్ధం చేస్తోంది. జర్మనీ .. 50 వెంటిలేటర్లను స్పెయిన్‌కు, మరో 60 వెంటిలేటర్లను యూకే కు పంపించింది. కోవిడ్ 19 బాధితుల్లో 15-20 శాతం మందికి వెంటిలేటర్స్ అవసరమైతే, 70శాతం మందికి ఇంటెన్సివ్ కేర్ కావాల్సి ఉంటుందని యూకేకు చెందిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ డీన్ డాక్టర్ అలిసన్ తెలిపారు.
tags :corona virus, pandemic, icu beds, ventilators, hospitals, south sudan, who, IRC