కానిస్టేబుల్‌ను మోసం చేసిన మహిళ.. ఎలా అంటే ?

దిశ, ఖైరతాబాద్ : రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళకు మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చినందుకు మెడలోని గొలుసు పోగొట్టుకున్నాడు ఓ కానిస్టేబుల్. సాధారణ ప్రజలను మోసం చేస్తే ఎం బాగుంటుంది అనుకుందో ఎమో కానీ కానిస్టేబుల్‌కే టోకరా వేసిందో కిలేడీ. గత మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కొండాపూర్లోని టీఎస్ఎస్పీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈశ్వర ప్రసాద్ నాగార్జున సర్కిల్ మీదుగా తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. […]

Update: 2021-11-16 00:45 GMT

దిశ, ఖైరతాబాద్ : రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళకు మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చినందుకు మెడలోని గొలుసు పోగొట్టుకున్నాడు ఓ కానిస్టేబుల్. సాధారణ ప్రజలను మోసం చేస్తే ఎం బాగుంటుంది అనుకుందో ఎమో కానీ కానిస్టేబుల్‌కే టోకరా వేసిందో కిలేడీ. గత మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కొండాపూర్లోని టీఎస్ఎస్పీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈశ్వర ప్రసాద్ నాగార్జున సర్కిల్ మీదుగా తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. మహిళ కదా అని జాలి చూపి లిఫ్ట్ ఇచ్చాడు. కొద్ది దూరంలోని పంజాగుట్ట చౌరస్తాలో ఆమె దిగిపోయింది. అనంతరం తన మెడలోని గొలుసు పోయిందన్న విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడిని గుర్తించే పనిలో పడ్డారు.

Tags:    

Similar News