భార్య, పిల్లలను పండుగకు పంపించిన భర్త..
దిశ, మర్రిగూడ: భార్య, పిల్లలను పండుగ కోసం అత్తవారింటికి పంపించి భర్త అదృశ్యం అయిన ఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన యాచారం పెద్దలు, మల్లమ్మ దంపతుల మూడో కుమార్తెను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం జనగాం గ్రామానికి చెందిన చిక్క నరసింహతో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమార్తెలు. కాగా, దసరా పండుగకు భార్య, […]
దిశ, మర్రిగూడ: భార్య, పిల్లలను పండుగ కోసం అత్తవారింటికి పంపించి భర్త అదృశ్యం అయిన ఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన యాచారం పెద్దలు, మల్లమ్మ దంపతుల మూడో కుమార్తెను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం జనగాం గ్రామానికి చెందిన చిక్క నరసింహతో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమార్తెలు.
కాగా, దసరా పండుగకు భార్య, పిల్లలను అత్త గారి ఊరైన మర్రిగూడ బస్ ఎక్కించాడు. తాను పండుగ రోజు వస్తానని సొంత గ్రామానికి వెళ్లాడు. గురువారం వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఫోన్ పని చేయకపోగా, బంధువులు, స్నేహితులు వద్దకూ వెళ్లలేదు. భర్త ఆచూకీ కోసం భార్య యాదమ్మ మూడు రోజులుగా వెతికి శనివారం మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.