ఛీఛీ నేను స్పందించను.. ఎన్టీఆర్‌ని రమ్మనను: బాలయ్య

దిశ, ఏపీ బ్యూరో: ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో పెను వివాదంగా నిలిచిన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దురుసుగా వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. దీనిపై మరో నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వివాదానికి […]

Update: 2020-06-02 00:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో పెను వివాదంగా నిలిచిన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దురుసుగా వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. దీనిపై మరో నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వివాదానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై బాలయ్యను స్పందించాల్సిందిగా కోరగా, “ఛీ, ఛీ… నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్‌గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?” అంటూ స్పందించేందుకు విముఖత వ్యక్తం చేశారు.

అయితే సినీ పరిశ్రమ పెద్దలు పిలవలేదు సరే… కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వమైనా పిలవాల్సింది కదా? అన్నదానిపై ఆయన స్పందిస్తూ, కేసీఆర్ గారు ఈ సమావేశాలకు తనను ఎందుకు పిలవలేదో తెలియదని అన్నారు. ఆయనకు తనపై ఎప్పుడూ కోపం లేదని స్పష్టం చేశారు. పైగా, ఎన్టీఆర్ అభిమాని అయిన కేసీఆర్‌కు తానంటే పుత్ర వాత్సల్యం ఉందని తెలిపారు. ఈ ఘటనను రాజకీయపరంగా చూడొద్దని పేర్కొన్నారు. గతంలో తాను కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల కారణంగా పిలిచుండకపోతే ఆ విషయమైనా తనతో చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.

ఇక ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా? అన్న ప్రశ్నకు బాలయ్య సమాధానం చెబుతూ, రాజకీయాల్లో రావడం, రాకపోవడం అనేది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత విషయమని అన్నారు. అది పూర్తిగా అతని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయినా, జూనియర్ ఎన్టీఆర్‌కి నటుడిగా ఎంతో భవిష్యత్ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. ఇంకా దానిపై ఆయన మాట్లాడుతూ, గతంలో తన తండ్రి నందమూరి తారకరామారావు ఏక కాలంలో రాజకీయాలు, సినీ రంగంలో కొనసాగారని, ఇప్పుడు తాను కూడా అదే పంథాలో పయనిస్తున్నానని చెప్పారు.

Tags:    

Similar News