పాత బస్తీలో ఘోరం.. వార్డ్ బాయ్ చేత వైద్యం.. వికటించడంతో..

దిశ, చార్మినార్: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన స్వర్ణకారుడు వైద్యం వికటించి మృతిచెందాడు. ఈ ఘటన చార్మినార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. వార్డు బాయ్​ ఇచ్చిన ట్రీట్​మెంట్ కారణంగానే వైద్యం వికటించి చనిపోయాడని మృతుని బంధువులు, న్యాయవాదులు, టీఆర్ఎస్​ నాయకులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. బెంగాల్​ కు చెందిన అష్టరాయ్​ 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్ పాతబస్తీ ఝాన్సీబజార్​కు వలస వచ్చాడు. ఝాన్సీబజార్​లో ఓ జ్యువెల్లరీ దుకాణంలో స్వర్ణకారుణిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం […]

Update: 2021-12-09 08:12 GMT

దిశ, చార్మినార్: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన స్వర్ణకారుడు వైద్యం వికటించి మృతిచెందాడు. ఈ ఘటన చార్మినార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. వార్డు బాయ్​ ఇచ్చిన ట్రీట్​మెంట్ కారణంగానే వైద్యం వికటించి చనిపోయాడని మృతుని బంధువులు, న్యాయవాదులు, టీఆర్ఎస్​ నాయకులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. బెంగాల్​ కు చెందిన అష్టరాయ్​ 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్ పాతబస్తీ ఝాన్సీబజార్​కు వలస వచ్చాడు. ఝాన్సీబజార్​లో ఓ జ్యువెల్లరీ దుకాణంలో స్వర్ణకారుణిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాయ్​కు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో భార్య స్థానికంగా ఉన్న మెడ్స్​ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ఉన్న సిబ్బంది రాయ్​కు ఇంజెక్షన్ ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాసేపటికే రాయ్ మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. దాంతో కుటుంబభ్యులు స్థానిక టీఆర్ఎస్ నాయకుడు దీపాంకర్​ పాల్​ దృష్టికి తీసుకువచ్చారు.

మృతుని బంధువులు, న్యాయవాది ఎ.మాణిక్​ ప్రభుగౌడ్​, టీఆర్ఎస్​ నాయకుడు దీపాంకర్​ పాల్​ తదితరులు మెడ్స్​ ఆసుపత్రి ముందు పై బైఠాయించారు. ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వార్డు బాయ్​తో చికిత్స చేయించారని, వెంటనే ఆసుపత్రిని సీజ్​ చేసి, మృతుని కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలని నేతలు డిమాండ్​ చేశారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకు దిగిన వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News