గోడకూలి ఆరుగురు కూలీలు మృతి
దిశ, వెబ్ డెస్క్: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులతో కూలీ కోసం వచ్చిన వారికి అనుకోని సంఘటన ఎదురైంది. రోజువారి పనిలో భాగంగా వారు పనిచేస్తుండే సమయంలో అక్కడి గోడకూలి ఆరుగురు కూలీలు మృతి చెందిన ఘటన బీహార్ లోని ఖగారియాలో చోటు చేసుకుంది. డ్రైనేజ్ పనులు చేస్తుండే సమయంలో ఈ సంఘటన జరిగినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.