కరోనా ఎఫెక్ట్: చార్‌దామ్ యాత్ర రద్దు

డెహ్రాడూన్: కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌దాయ్ యాత్రను రద్దు చేసింది. మే 14న ఈ యాత్ర ప్రారంభం కావాల్సింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ‘కరోనా పరిస్థితుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రను రద్దు చేస్తున్నదని సీఎం తీరథ్ సింగ్ రావత్ అన్నారు. బద్రినాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు పురోహితులు మాత్రమే ఈ ఏడాది పూజ, క్రతువులు నిర్వహిస్తారని వివరించారు. బుధవారం ఉత్తరాఖండ్ […]

Update: 2021-04-29 01:37 GMT

డెహ్రాడూన్: కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌దాయ్ యాత్రను రద్దు చేసింది. మే 14న ఈ యాత్ర ప్రారంభం కావాల్సింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ‘కరోనా పరిస్థితుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రను రద్దు చేస్తున్నదని సీఎం తీరథ్ సింగ్ రావత్ అన్నారు. బద్రినాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు పురోహితులు మాత్రమే ఈ ఏడాది పూజ, క్రతువులు నిర్వహిస్తారని వివరించారు. బుధవారం ఉత్తరాఖండ్ అత్యధిక కేసులు(6,054) నమోదు చేసింది.

Tags:    

Similar News