చైనా దూకుడుపై చర్యలు.. భద్రతపై సమీక్షకు యూకే ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్‌ను సృష్టించి ప్రపంచ దేశాలను చైనా అతలాకుతం చేస్తోంది. ప్రస్తుతం చైనా దుష్ట పన్నాగాలకు యావత్ ప్రపంచం భయపడుతోంది. ఇప్పటికే భారత్ చైనాకు చెందిన 59 యాప్స్ బ్యాన్ చేయగా, తాజాగా యూకే కూడా చైనా సైబర్ దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే యూకేకు చెందిన పలువురు మంత్రులు చైనా సైబర్ 9/11గా పేరిట బ్రిటన్ సర్వర్లే లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడికి యోచిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్‌ను సృష్టించి ప్రపంచ దేశాలను చైనా అతలాకుతం చేస్తోంది. ప్రస్తుతం చైనా దుష్ట పన్నాగాలకు యావత్ ప్రపంచం భయపడుతోంది. ఇప్పటికే భారత్ చైనాకు చెందిన 59 యాప్స్ బ్యాన్ చేయగా, తాజాగా యూకే కూడా చైనా సైబర్ దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే యూకేకు చెందిన పలువురు మంత్రులు చైనా సైబర్ 9/11గా పేరిట బ్రిటన్ సర్వర్లే లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడికి యోచిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం ద్వారా, ఫోన్ మరియు పవర్ బ్లాక్ ఔట్ చేయడంతో పాటు కీలక వ్యాపారాలు, ప్రభుత్వం విభాగాలు, ఆసుపత్రులను టార్గెట్ చేసి సైబర్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయని భద్రతా అధిపతులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు కుయుక్తులకు వ్యతిరేకంగా బ్రిటన్ తన వైఖరిని కఠినతరం చేయడానికి సిద్ధంగా ఉందని, జాతీయ భద్రతా మంత్రి కోనార్ మెక్గిన్ తెలిపారు.
చైనా దూకుడుపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే హువావే యొక్క భద్రతపై సమీక్షకు యూకే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే నివేదికలు వచ్చిన తరువాత, చైనా టెలికాం దిగ్గజం హువావే తన 5 జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయకుండా యూకే నిషేధించే అవకాశం ఉంది. అటు చైనా జాతీయ భద్రతా చట్టానికి ప్రతిస్పందనగా ఇటీవల హాంకాంగ్ పౌరులకు యూకే పౌరసత్వం ఇవ్వాలన్న నిర్ణయం కూడా చైనా ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి కారణంగా మారింది. అంతేకాదు కరోనావైరస్ మూలాలు దర్యాప్తు చేయడానికి బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా విచారణకు పిలుపునిచ్చారు.