బీజేపీ నాయకుల దురాగతం.. నడిరోడ్డుపై మహిళా నేత చీర లాగి.. ( వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: మృగాళ్ళుగా మారుతున్న మగాళ్లు, మహిళలకు విలువే లేకుండా చేస్తున్నారు. ఎప్పుడో పురాణాలలో జరిగిన దుశ్శాసన పర్వం తాజాగా ఉత్తరప్రదేశ్ లో నడిరోడ్డుపై జరిగింది. ఒక మహిళా నాయకురాలిని ఇద్దరు నేతలు నడిరోడ్డుపై చీర కొంగును లాగి అవమానించిన ఘటన యూపీలో సంచలనంగా మారింది. pic.twitter.com/TqepdO3y4W — Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021 వివరాలలోకి వెళితే.. ఉత్తప్రదేశ్‌లో బ్లాకు పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ […]
దిశ, వెబ్‌డెస్క్: మృగాళ్ళుగా మారుతున్న మగాళ్లు, మహిళలకు విలువే లేకుండా చేస్తున్నారు. ఎప్పుడో పురాణాలలో జరిగిన దుశ్శాసన పర్వం తాజాగా ఉత్తరప్రదేశ్ లో నడిరోడ్డుపై జరిగింది. ఒక మహిళా నాయకురాలిని ఇద్దరు నేతలు నడిరోడ్డుపై చీర కొంగును లాగి అవమానించిన ఘటన యూపీలో సంచలనంగా మారింది.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021
వివరాలలోకి వెళితే.. ఉత్తప్రదేశ్‌లో బ్లాకు పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. లఖింపూర్ ఖేరీ పరిధిలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్‌ను ప్రతిపాదించడానికి సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ మహిళ నామినేషన్ కేంద్రానికి వెళుతోంది. ఇంతలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆమెను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తూ చీర కొంగును పట్టుకుని లాగారు. ఆమె దూరం జరగడానికి ప్రయత్నించినా కూడా క్షణాల్లో ఆమె కొంగును లాగి ఆమె చేతిలోను పత్రాలను తీసుకున్నారు. ఇది గమనించిన అక్కడున్న వారు పురుషుల చర్యను అడ్డుకున్నారు. ఈ ఘటన జరిగేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నట్టు సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై తీవ్రంగా మండిపడుతూ.. యోగి గుండాల అధికార దాహం అంటూ విమర్శించారు.