దేవరయాంజల్ ఆలయ భూములపై విచారణ షురూ
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా, శామీర్ పేట మండలంలోని దేవరయాంజల్ ఆలయ భూములపై కమిటీ విచారణ చేపట్టింది. సోమవారం ప్రభుత్వం.. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. దీంతో వెంటనే కమిటీలోని సభ్యులు రఘునందన్ రావు, ప్రశాంత్ జీవన్, భారతి హోలికెరి, శ్వేతా మహంతిలు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా, శామీర్ పేట మండలంలోని దేవరయాంజల్ ఆలయ భూములపై కమిటీ విచారణ చేపట్టింది. సోమవారం ప్రభుత్వం.. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. దీంతో వెంటనే కమిటీలోని సభ్యులు రఘునందన్ రావు, ప్రశాంత్ జీవన్, భారతి హోలికెరి, శ్వేతా మహంతిలు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఆఘమేఘాల మీద దేవరయాంజల్‌లోని మాజీ మంత్రి ఈటల ఆధీనంలో ఉన్న 12 ఎకరాల భూమిలో నిర్మించిన షెడ్లను పరిశీలించారు. దాదాపు లక్ష చదరపు అడుగులలో నిర్మించిన షెడ్లతో పాటు లిక్కర్ గోడౌన్‌ను సైతం పరిశీలించి, ఆధారాలను సేకరించారు.