తాలిబన్ల క్రూర చర్య.. జర్నలిస్టులను గదిలో బంధించి.. అండర్ వేర్‌తో

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం రోజురోజుకు ఎక్కువైపోతోంది. చిన్నారులను, మహిళలను క్రూరంగా హింసిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తాలిబన్లు జర్నలిస్టుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ ఏరియాలో మహిళల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్నారని వారిని గదిలో బంధించి.. బట్టలు విప్పి.. విచక్షణా రహితంగా కొట్టడం కలకలంగా మారింది. వివరాలలోకి వెళితే.. తఖీ దర్‌యాబీ, నీమతుల్లా నక్దీ అనే ఇద్దరు జర్నలిస్టులు వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ […]

Update: 2021-09-09 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం రోజురోజుకు ఎక్కువైపోతోంది. చిన్నారులను, మహిళలను క్రూరంగా హింసిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తాలిబన్లు జర్నలిస్టుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ ఏరియాలో మహిళల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్నారని వారిని గదిలో బంధించి.. బట్టలు విప్పి.. విచక్షణా రహితంగా కొట్టడం కలకలంగా మారింది.

వివరాలలోకి వెళితే.. తఖీ దర్‌యాబీ, నీమతుల్లా నక్దీ అనే ఇద్దరు జర్నలిస్టులు వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ ఏరియాలో మహిళల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్నారు. వారికి సపోర్ట్ చేస్తున్నారని ఆ ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు అపహరించి, ఓ గదిలో బంధించారు. కేవలం వారి శరీరంపై అండర్‌వేర్ మాత్రమే ఉంచి, వారిని చితకబాదారు. వారు జర్నలిస్టులం అని మొత్తుకున్నప్పటికీ వినిపించుకోకుండా ఆ ఇద్దరు జర్నలిస్టులను హింసిస్తూ, ఎగతాళి చేశారు. తమతో పాటు మరికొంత మంది జర్నలిస్టులను అపహరించి, ఆ తర్వాత విడుదల చేశారని ఆ ఇద్దరు జర్నలిస్టులు తెలిపారు. ఆప్ఘనిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని తాలిబన్లే తెలిపారని, కానీ వారి చర్యలు వేరేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్ఘన్ ప్రజల నిరసనలను, ఇతర కార్యక్రమాలను కవర్ చేయొద్దని తమను హెచ్చరించినట్లు తెలిపారు.

Tags:    

Similar News