ధరణిలో సమస్యలు లేకుండా చేస్తాం : ప్రశాంత్ రెడ్డి

దిశ,వెబ్ డెస్క్: వారం రోజుల్లోగా ధరణిలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సబ్ కమిటీ భేటి మంగళవారం ముగిసింది. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… క్రయ విక్రయాల్లో పారదర్శకత కోసమే ధరణి పోర్టల్ తెచ్చామని అన్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతంగా […]

Update: 2020-12-15 08:10 GMT

దిశ,వెబ్ డెస్క్: వారం రోజుల్లోగా ధరణిలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సబ్ కమిటీ భేటి మంగళవారం ముగిసింది. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… క్రయ విక్రయాల్లో పారదర్శకత కోసమే ధరణి పోర్టల్ తెచ్చామని అన్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకు వెళ్తామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్లరకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సూచనలు స్వీకరించామని చెప్పారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నాలుగు రకాలుగా విభజించామని తెలిపారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట ఎక్కువ మందిని నియమిస్తామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి బ్యాంకుల అపోహలను తొలగిస్తామని అన్నారు. ఈ నెల 17న బిల్లర్స్, రియల్టర్లతో సమావేశం అవుతామని చెప్పారు.

Tags:    

Similar News